
- తెలంగాణకు చెందిన ‘అక్షరాభ్యాసం’కు స్పెషల్ప్రైజ్
న్యూఢిల్లీ, వెలుగు: ఏపీకి చెందిన ‘ఫైట్ ఫర్ రైట్స్’ అనే షార్ట్ ఫిలింకు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సీ) రెండో బహుమతి దక్కింది. 2024 ఏడాదికి గాను మానవ హక్కులు అంశంపై షార్ట్ ఫిలిమ్స్ పదో వార్షిక పోటీని ఎన్‌హెచ్‌ఆర్‌సీ నిర్వహించింది. మొత్తం 303 షార్ట్ ఫిలిమ్స్ పరిశీలనకు రాగా.. 243 ఎంట్రీలు పురస్కారాల కోసం బరిలో నిలిచాయి. ఈ పోటీల్లో ‘దూద్ గంగా- వేలీస్ డయింగ్ లైఫ్‌లైన్’కు మొదటి బహుమతి దక్కింది. ప్రోత్సాహకంగా రూ.2 లక్షల నగదు అందజేయనున్నారు. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఇంజినీరు అబ్దుల్ రశీద్ భట్ ఈ డాక్యుమెంటరీని తీశారు. దూద్ గంగ నదిలోని వ్యర్థాలను యథేచ్ఛగా వదిలివేయడంతో నది నీరు ఎలా కలుషితమైపోతున్నది ఇందులో చూపించారు.
ఫైట్ ఫర్ రైట్స్’ రెండో బహుమతికి ఎంపికైంది. ఈ షార్ట్ ఫిలింకు రూ.1.5 లక్షలు దక్కనున్నాయి. ఏపీకి చెందిన కడారప్ప రాజు ఈ చిత్రాన్ని రూపొందించారు. బాల్య వివాహం, విద్య అనే అంశాన్ని ఇందులో చర్చించారు. గాడ్’ అనే చిత్రానికి మూడో బహుమతి వచ్చింది. తమిళనాడుకు చెందిన ఆర్. రవిచంద్రన్ తాగునీరు ప్రాధాన్యాన్ని ఈ మూకీ చిత్రం ద్వారా వివరించారు.
ప్రత్యేక కేటగిరీలో తెలంగాణకు చెందిన ‘అక్షరాభ్యాసం’- షార్ట్‌ఫిలిం బహుమతి పొందింది. హనీశ్ ఉండ్రమాట్ల బాలల విద్య ప్రాముఖ్యంపై ఈ మూకీ చిత్రాన్ని రూపొందించారు. దీనికి రూ.50 వేల ప్రోత్సాహకం అందనుంది. ఏపీకి చెందిన మడక వెంకట సత్యనారాయణ ధార్మిక సంప్రదాయాలపై రూపొందించిన ‘లైఫ్ఆఫ్సీత’ కూడా ప్రత్యేక బహుమతి సొంతం చేసుకుంది. త్వరలోనే ఈ బహుమతులు ప్రదానం చేయనున్నారు.