రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు కేసులో అనుమానితుడి ఫొటోలు

బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో  బాంబు పేలుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మార్చి 1న జరిగిన బాంబ్‌ బ్లాస్ట్ లో అదృష్టశాత్తు ప్రాణ నష్టం ఎక్కువగా జరగలేదు. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ  కేసులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తు ఉమ్మరం చేసింది. నిందితుడి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తోంది. ఈ క్రమంలో పేలుడు ఘటనతో సంబంధం ఉన్న అనుమానితుడికి సంబంధించిన మరో కొత్త ఫొటోలను రిలీజ్‌ చేసింది. ఫొటోల్లో నిందితుడు టీ షర్ట్‌, ముఖానికి మాస్క్‌తో ఉన్నాడు. అతని చేతిలో బ్యాగ్‌ కూడా ఉంది.

కేఫ్‌లో  బ్లాస్ట్ అయిన గంట తర్వాత ఈ అనుమానితుడు బస్సు ఎక్కినట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డైంది. వీడియోలోని టైమ్‌స్టాంప్ మార్చి 1న మధ్యాహ్నం 2:03 గంటలకు ఉంది. పేలుడు మధ్యాహ్నం 12:56 గంటలకు జరిగింది. అదే రోజు రాత్రి 9 గంటలకు మరో ఫుటేజీలో అనుమానితుడు బస్ స్టేషన్‌లో తిరుగుతున్నట్లు గమనించారు. దీంతో ఈ పేలుడు ఘటనలో అతడే ప్రధాన నిందితుడిగా అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

ALSO READ :- ఏ పార్టీతో పొత్తు పెట్టుకోం.. మాయావతి కీలక ప్రకటన..