హైదరాబాద్లో ఎన్ఐఏ సోదాలు

హైదరాబాద్లో ఎన్ఐఏ సోదాలు

ఇటీవల ఢిల్లీలో ఉగ్రవాది రిజ్వాన్ అరెస్ట్ అయిన క్రమంలో హైదరాబాద్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు. ఆదివారం ( సెప్టెంబర్22)  సైదాబాద్ పరిధిలోని శంఖేశ్వర్ బజార్లోని గ్రీన్ వ్యూ అపార్టుమెంట్లో సోదాలు చేశారు ఎన్ ఐఏ అధికారులు. సుమారు గంటపాటు తనిఖీలు నిర్వహించారు. ఇటీవల ఢిల్లీలో అరెస్ట్ అయిన ఉగ్రవాది రిజ్వాన్ అబ్దుల్ గ్రీన్ వ్యూ అపార్టుమెంటులో నివాసం ఉన్నట్లు విచారణలో తేలడంతో.. ఆదివారం ఎన్ఐఏ అధికారులు ఈ అపార్టుమెంటులో సోదాలు నిర్వహించారు. రిజ్వాన్ను హైదరాబాద్కు తీసుకొచ్చి  గ్రీన్ వ్యూ అపార్టుమెంట్లో  సోదాలు చేశారు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు. 

ఆగస్టులో ఉగ్రవాది రిజ్వాన్ అబ్దుల్ను ఢిల్లీలో అరెస్ట్ ఎన్ఐఏ చేసింది. ఐసిస్తో సంబంధం ఉన్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ రిజ్వాన్. ఐసిస్ పూణెలో మాడ్యుల్లో భాగంగా పనిచేస్తున్న రిజ్వాన్ అబ్దుల్.. ఢిల్లీలోని గంగా బక్ష్ మార్గ్ వద్ద అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయంలో రిజ్వాన్ వద్దా 30 బోర్ పిస్టల్, మూడు లైవ్ కాట్రిడ్జ్లు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు ఎన్ఐఏ అధికారులు. ఢిల్లీలోని స్పెషల్ సెల్ పోలీస్ స్టేషన్లో రిజ్వాన్పై కేసు నమోదు చేశారు. గతంలో రిజ్వాన్ తలపై రూ.3 లక్షల నజరానా కూడా ప్రకటించారు పోలీసులు.