- ఈనెల 28 నుంచి 10 రోజుల పాటు రాత్రిపూట కర్ఫ్యూ
- రాత్రి 10 నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ
బెంగళూరు: కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. నిన్న ఒక్కరోజే ఏడు కేసులు నమోదుకావడంతో ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై కేబినెట్ మంత్రులతో అత్యవసర భేటీ అయ్యారు. తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని కర్ణాటక కేబినెట్ నిర్నయించింది. నెల 28 నుంచి 10 రోజుల పాటు కర్ణాటక లో రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సుధాకర్ తెలిపారు. రాష్ట్రంలో 75శాతం మందికి రెండు డోసులు వేశామన్నారు. వయోవృద్ధులకు జనవరి 10 నుంచి బూస్టర్ డోస్ అందిస్తామన్నారు కర్ణాటక మంత్రి సుధాకర్ .
ఇవి కూడా చదవండి: