- విజయవంతంగా చేసిన బ్రిటన్డాక్టర్లకు యాజమాన్యం సత్కారం
పంజాగుట్ట, వెలుగు: లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్, నిమ్స్సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ నిమ్స్ లో నిర్వహించిన పీడియాట్రిక్ సర్జరీ క్యాంప్ శనివారం ముగిసింది. బ్రిటన్ డాక్టర్ల బృందం ఆధ్వర్యంలో ఉచితంగా 18 మంది చిన్నారులకు హార్ట్సర్జరీలను విజయవంతంగా చేశారు. వీరిలో 14 రోజుల పిల్లల నుంచి 10 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. బ్రిటన్‌లోని ఆల్డర్హే హాస్పిటల్స్ లివర్‌పూల్‌కు చెందిన డాక్టర్ రమణ దన్నపునేని నేతృత్వంలోని12 మంది బృందంలో యూఎస్, అబుధాబీ, ఇటలీ, పోర్చుగల్, ఇతర దేశాలకు చెందిన వైద్య నిపుణులు ఉన్నారు.
పీడియాట్రిక్ క్యాంప్‌కు విశేషమైన స్పందన వచ్చిందని డాక్టర్ రమణ చెప్పారు. క్యాంప్ కు రాష్ట్రవ్యాప్తంగా గుండె జబ్బులున్న 700 మంది చిన్నారులు రాగా, 50 మంది రోగులను కార్డియాలజీ విభాగానికి పంపించామన్నారు. వారిలో 75 మంది రోగులకు ఆపరేషన్సాధ్యం కాదని తేల్చి కౌన్సెలింగ్ ఇచ్చామన్నారు. సుమారు 100 మంది రోగులకు వారి గుండె పరిస్థితిని వివరించామని, శస్త్రచికిత్సల కోసం 450 మంది రోగులకు ఆపరేషన్చేసే తేదీలను నిమ్స్యాజమాన్యం నిర్ణయించిందని, వారికి నిమ్స్ఆస్పత్రిలో దశలవారీగా సర్జరీలు చేస్తారని వెల్లడించారు. క్యాంపులో భాగంగా ఫ్రీగా చేశామని వెల్లడించారు. క్యాంప్ పూర్తయిన సందర్భంగా బ్రిటన్ వైద్య బృందాన్ని నిమ్స్ లర్నింగ్సెంటర్లో ప్రొఫెసర్అమరేశ్వరరావు అధ్యక్షతన డాక్టర్లు సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.