నిధులున్నా స్టార్ట్​కాని చెక్​డ్యాంల పనులు

నిధులున్నా స్టార్ట్​కాని చెక్​డ్యాంల పనులు
  • 19 చెక్ డ్యామ్​లకురూ.100 కోట్లు మంజూరు 
  • ఏడాదిన్నర క్రితం శంకుస్థాపనలు

నిర్మల్, వెలుగు: నిర్మల్ జిల్లాలో  19 చెక్ డ్యామ్ ల కోసం  కోట్ల నిధులు ఉన్నా.. పనులు మాత్రం స్టార్ట్​ కావడం లేదు.  చెక్​ డ్యామ్​లను వెంటనే నిర్మించాలని కాంగ్రెస్​ ప్రభుత్వం ఆదేశించినప్పటికీ..  కాంట్రాక్టర్లు ముందుకు  రాకపోవడంతో పనులను పెడింగ్​లోపడుతున్నాయి.    

ఏడాదిన్నర కింద శంకుస్థాపనలు 

 ఈ 19 చెక్ డ్యా మ్ ల  కోసం  బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారులు లో  రూ. 114 కోట్ల 68 లక్షల  ప్రతిపాదనలను రూపొందించారు.  రూ. 101 కోట్లకు     బడ్జెట్​ను కుదించి, పనులకు అప్పటి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.   కాంగ్రెస్​ ప్రభుత్వం  పనుల  అంచనాలను మళ్లీ వెరిఫై చేసి, గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. నిర్మల్ నియోజకవర్గంలో స్వర్ణానది, మేడిపల్లి వాగు పైన 6 చెక్ డ్యామ్ ల కోసం రూ. 34 కోట్ల ను, ముధోల్ నియోజకవర్గం లో సుద్ద వాగు, బిదిరెల్లి వాగు, కుప్టి వాగు, డోడర్న , జరి వాగులపై మొత్తం తొమ్మిది చెక్ డాంల  కోసం రూ. 43 కోట్లను, ఖానా పూర్ నియోజకవర్గంలో కడెం వాగు ప్రవాహంపై నాలుగు చెక్ డ్యాంలకు రూ. 29 కోట్లను  ప్రభుత్వం మంజూరు చేసింది. 

 పనులు చేపట్టాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశం

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే  నిధులు మంజూరు కాగా..  టెండర్లు కూడా పూర్తి అయ్యాయి.   అంతలోనే ఎన్నికలు రావడం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టడంతో ఈ పనులను తాత్కాలికంగా ఆగిపోయాయి. అన్ని శాఖల్లో   అప్పటి ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులను నిలిపివేసి మళ్ళీ  తాజా అంచనాలతో ప్రతిపాదనలను రూపొందించారు.

 ఇందులో భాగంగానే 19 చెక్ డ్యామ్ ల నిర్మాణాల టెండర్లను సైతం రద్దు చేయాలని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. కానీ,  ప్రస్తుత ధరలను పరిగణలోకి తీసుకొని  ఈ పనుల టెండర్లను కొనసాగించింది.  అప్పట్లో టెండర్లు దక్కించుకున్న వారికే తిరిగి పనులు అప్పగించింది.   కానీ కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు.  స్థానికంగా ఉండే రాజకీయ నాయకుల ఒత్తిళ్లే కాంట్రాక్టరు పనులు చేసేందుకు రాకపోవడానికి కారణమన్న ప్రచారం జరుగుతోంది.  

కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు...

నిర్మల్ జిల్లాలో   19 చెక్ డ్యాముల నిర్మాణాలకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. ఇప్పటికే పనులు చేపట్టాలంటూ కాంట్రాక్టర్లకు సూచించాం. ఈ పనులకు సంబంధించిన అగ్రిమెంట్ ప్రక్రియ కూడా పూర్తయింది. ఇప్పటికే పనులు మొదలు కావాల్సి ఉంది.  గత ప్ర భుత్వ హయాంలో పనులు మంజూరు కావడంతో ప్రస్తుత ప్రభుత్వం మొదట్లో ఈ పనులను చేపట్టాలా వద్దా అని భావించి అనంతరం పనులు చేపట్టేందుకే నిర్ణయించింది. కొద్ది రోజుల్లోనే పనులు మొదలు పెట్టేందుకు చర్యలు తీసుకుంటాం. - లక్ష్మి ,ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, నిర్మల్.