
నిర్మల్ మున్సిపల్ సమావేశం రసాభసాగా జరిగింది. ఈ సమావేశంలో టీఆర్ఎస్ చైర్మన్, కౌన్సిలర్లను బీజేపీ పార్టీకి చెందిన కౌన్సిలర్లు అడ్డుకున్నారు. నాలుగేళ్లుగా మున్సిపాల్టీ పరిధిలో అభివృద్ది కార్యక్రమాలు జరగలేదని నిలదీశారు. నిర్మల్ మున్సిపాల్టీలో భారీగా అవినీతి జరిగిందన్నారు. అవినీతి చేయడంలో నిర్మల్ మున్సిపాల్టీ రాష్ట్ర స్థాయిలో రికార్డ్ సాధించిందని బీజేపీ సభ్యలు అన్నారు. అవసరం లేని పనులకు మున్సిపల్ నిధులను వృధాగా ఖర్చు చేసి నిర్మల్ మున్సిపాల్టీని పాలకులు భ్రష్టు పట్టించారన్నారు. నిర్మల్ మున్సిపాల్టీలో జరిగిన అవినీతిని వెలికి తీసేందుకు అధికారులు స్థానిక ఎమ్మెల్యేతో చర్చించి... ఎంక్వయిరీ కమిషన్ వేసి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ కౌన్సిల్ సభ్యులు కోరారు.