చెరువులో మట్టి తవ్వకాలపై ఉద్రిక్తత

డిచ్​పల్లి, వెలుగు: మండలంలోని అమృతాపూర్​లో చెరువులో మట్టి తవ్వకాలపై ఆదివారం రెండు వర్గాల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది. చెరువు మట్టి పూడికతీతతో వచ్చిన ఆదాయంలో 75 శాతం అమృతాపూర్ ​గ్రామానికి, 25 శాతం ఒడ్డెర కాలనీకి కేటాయించాలని వీడీసీ లో తీర్మానించారు. నిర్ణయించిన ప్రకారం తమ వాటా ఇవ్వడం లేదని కాలనీవాసులు మట్టి తవ్వకాల్ని అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని చెదరగొట్టారు.