కులగణన సరిగా చేయలేదు : బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్

కులగణన సరిగా చేయలేదు : బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్
  • నిజామాబాద్  ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శ
  • తన ఇంటికి ఎవరూ రాలేదని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: కులగణన సరిగా చేయలేదని, తన ఇంటికి ఎవరూ రాలేదని నిజామాబాద్  బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్  అన్నారు. బుధవారం బీజేపీ స్టేట్  ఆఫీసులో ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డితో కలిసి మీడియాతో ఎంపీ మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తానంటే తాను ఆహ్వానిస్తానని చెప్పారు. రాహుల్  ఒక గ్రహాంతరవాసి అని, ఎప్పుడు ఏం చేస్తారో ఆయనకే తెలియదని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ మన రాష్ట్రానికి ఏడు నవోదయ విద్యాలయాలు కేటాయించారని పేర్కొన్నారు.

తన  సెగ్మెంట్ పరిధిలోని జగిత్యాల, నిజామాబాద్ లో రెండు నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలనుకున్నానని, దీనికోసం కాంగ్రెస్  ఎమ్మెల్యేలతో చర్చలు జరిపానని తెలిపారు. ‘‘గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఎక్కువగా చేరతారు కాబట్టి అందరికీ అందుబాటులో ఉండేలా జిల్లా కేంద్రంలో పెట్టాలని నిర్ణయించాం.

అయితే, మరో నవోదయ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాక.. బోధన్ ఎమ్మెల్యే సుదర్మన్ రెడ్డి నిజాం షుగర్  ఫ్యాక్టరీ ల్యాండ్  ఇచ్చారు. దీంతో నవోదయ ఏర్పాటుకు సరైన స్థలం కాదని, ఇష్యూస్  ఉన్న ల్యాండ్ కేటాయించడంతో దాన్ని రిజెక్ట్  చేశారు” అని అర్వింద్  పేర్కొన్నారు.