అప్పులు తెచ్చి అభివృద్ధి చేస్తే... బిల్లులు రాక సర్పంచ్ ఆత్మహత్య

నిజామాబాద్: మాక్లూర్ మండలం కల్లెడ సర్పంచ్ లావణ్య గౌడ్ ఆత్మహత్యాయత్నం చేశారు. నిద్రమాత్రలు మింగి అపస్మారక స్థితిలో ఉండటంతో స్థానికులు ఆమెను నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సర్పంచ్​లావణ్య రూ.30 లక్షలు అప్పు చేసి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అయితే ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడం.. అప్పు ఇచ్చిన వాళ్ల నుంచి ఒత్తిడి పెరగడంతో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నాకి పాల్పడ్డారు. 

మరోవైపు అధికార పార్టీకి చెందిన సర్పంచ్ లావణ్య భర్త ప్రసాద్ గౌడ్ కు ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మధ్య విభేదాలు వచ్చాయి. అయితే  ప్రసాద్ ఏడాది కిందట హత్యాయత్నం కేసులో అరెస్ట్ అయి ఇటీవల బెయిల్ పై విడుదలయ్యాడు. గ్రామ పంచాయతీ ఫండ్స్ అవకతవకల ఆరోపణలపై ఫిబ్రవరి 2022లో  ఉన్నతాధికారులు ఆమెను సర్పంచి పదవి నుంచి సస్పెండ్ చేశారు. కేసులు, ఆర్థికంగా చితికిపోవడంతో లావణ్య సూసైడ్​అటెంప్ట్​చేసిందని కుటుంబసభ్యులు తెలిపారు.