బస్తీ దవాఖానాలు ఏమయ్యాయి?

నిజామాబాద్​అర్బన్, వెలుగు: పట్టణ ప్రాంతాల్లోని పేదలకు మెరుగైన వైద్యం అందించడానికి డివిజన్​కు ఓ బస్తీ దవాఖానా ఏర్పాటు చేస్తున్నామని చెప్పిన ప్రభుత్వ హామీలు ఏమయ్యాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్​పాల్ ​సూర్యనారాయణ ప్రశ్నించారు. గడపగడపకు బీజేపీలో భాగంగా బుధవారం నగరంలోని 41వ డివిజన్​లో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్​ మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారే తప్పా, చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. 

ఒకటోరెండో చోట్ల బస్తీ దవాఖానాలున్నా, అందులో సరైన వసతులు లేవన్నారు. రేషన్​కార్డులు అందక, డబుల్​ బెడ్​రూమ్​ ఇండ్లు మంజూరుకాక, అర్హులైనవారికి కొత్త పింఛన్లు లేక నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.  ప్రజలందరూ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్​ను ఓడించడం ఖాయమన్నారు. ఆయన వెంట కార్పోరేటర్ ​ఇందిరా, లీడర్లు లక్ష్మీనారాయణ, సుధీర్, వినోద్​రెడ్డి, ప్రభాకర్, కిషన్ పాల్గొన్నారు.