పారిశుధ్యంపై దృష్టి పెట్టండి : ధన్ పాల్

పారిశుధ్యంపై దృష్టి పెట్టండి : ధన్ పాల్
  • అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్

నిజామాబాద్ సిటీ, వెలుగు : నగరంలో పేరుకుపోయిన చెత్త తొలగింపుపై దృష్టి పెట్టాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నాందేవాడ, హమాల్ వాడి 35,36 డివిజన్లలో మంగళవారం ఎమ్మెల్యే మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నగరంలో డ్రైనేజీ పూడిక తీయాలన్నారు. 

నగరంలో వీధి లైట్లు ఏర్పాటు చేయాలని కమిషనర్  ను ఆదేశించారు. నాందేవాడ, హమాల్ వాడి 35,36 డివిజన్ లో  ఉన్న పట్టణపకృతి వనాలు ఆధ్వానంగా ఉన్నాయన్నారు.  అనంతరం  రేణుకా ఎల్లమ్మ కల్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఈఈ మురళీమోహన్ రెడ్డి, అడిషనల్ మున్సిపల్ కమిషనర్ జయకుమార్, డిప్యూటీ ఈఈ సుదర్శన్ రెడ్డి, షాజీద్ అలీ, పావని పాల్గొన్నారు.