అర్బన్​ నియోజకవర్గాన్ని స్మార్ట్​ సిటీగా మార్చేందుకు కృషి

అర్బన్​ నియోజకవర్గాన్ని స్మార్ట్​ సిటీగా మార్చేందుకు కృషి

నిజామాబాద్ సిటీ, వెలుగు : అర్బన్ నియోజకవర్గాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నానని అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా అన్నారు. శుక్రవారం ఎంపీ అరవింద్  సహకారంతో ఢిల్లీ నిర్మాణ్ భవన్ లోని కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి కె. శ్రీనివాస్ ని ఎమ్మెల్యే మర్యాద పూర్వకంగా కలిశారు. 

నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.  కార్యక్రమంలో బీజేపీ నాయకులు మొరెపల్లి సత్యనారాయణ, జ్యోతి, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.