KKR vs RCB: రూ.11 కోట్ల బౌలర్‌కు ఏమైంది.. భువనేశ్వర్ లేకుండా బరిలోకి దిగిన ఆర్సీబీ

KKR vs RCB: రూ.11 కోట్ల బౌలర్‌కు ఏమైంది.. భువనేశ్వర్ లేకుండా బరిలోకి దిగిన ఆర్సీబీ

ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా నైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రైడర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తో జరుగుతున్న టోర్నీ తొలి మ్యాచ్ లో రాయల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కు చోటు దక్కలేదు. టాస్ తర్వాత ఆర్సీబీ ప్రకటించిన తుది జట్టులో భువికి స్థానం లేకపోవడంతో ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురయ్యారు. ఎన్నో అంచనాలు.. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ స్వింగ్ కింగ్ లేకపోవడంతో ఒక్కసారిగా బెంగళూరు ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు. అయితే భువనేశ్వర్ తొలి మ్యాచ్ లో ఎందుకు బరిలోకి దిగలేదో ఇప్పుడు చూద్దాం. 

మ్యాచ్ కు ముందు భువీ జ్వరంతో ఇబ్బందిపడుతున్నట్టు సమాచారం. ఈ కారణంగానే అతను శనివారం (మార్చి 22)ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొనలేదట. టాస్ తర్వాత పటిదార్ భువనేశ్వర్ గురించి ఎలాంటి  కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్ చేయగల భువనేశ్వర్ లేకపోవడం ఆర్సీబీ జట్టుకు మైనస్ గా మారనుంది. ఐపీఎల్ వేలంలో భారత ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ కు భారీ ధర పలికింది. ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ లో భువీని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.10.75 కోట్లకు దక్కించుకుంది. 

ALSO READ | KKR vs RCB: ఐపీఎల్ తొలి మ్యాచ్.. కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతాపై టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న బెంగళూరు

2024 ఐపీఎల్ సీజన్ లో భువీ సన్ రైజర్స్ తరపున ఆడాడు. చాలా సంవత్సరాల తర్వాత అతను హైదరాబాద్ జట్టును వీడి బయటకు రావడం ఇదే తొలిసారి. కొన్నేళ్లుగా సన్ రైజర్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చిన ఈ భారత ఫాస్ట్ బౌలర్ ను రిటైన్ చేసుకోవడానికి హైదరాబాద్ జట్టు ఆసక్తి చూపించలేదు. దీంతో మెగా ఆక్షన్ లో ఈ స్వింగ్ కింగ్ భారీ మొత్తాన్ని సంపాదించాడు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో రాయల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చాలెంజర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెంగళూరు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.