సర్కార్ కరోనా ఆస్పత్రిలో దారుణం
కనీస సౌలతులు, ట్రీట్మెంట్ అందట్లేదని
పేషెంట్ల బంధువుల ఆరోపణ
మంచిర్యాల/బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని ఐసోలేషన్ సెంటర్లో కరోనా పేషెంట్లు పిట్టల్లా రాలుతున్నారు. బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు 12 మంది కరోనాకు బలయ్యారు. దీంతో కరోనా పేషెంట్లు, వారి కుటుంబ సభ్యులు బెంబేలెత్తిపోతున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. డాక్టర్లు, ఐసోలేషన్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే పేషెంట్లు చనిపోతున్నారని, ఆక్సిజన్ సరిగ్గా అందట్లేదని కరోనా పేషెంట్ల బంధువులు ఆరోపిస్తున్నారు. అయితే, పరిస్థితి సీరియస్ అయ్యాక తీసుకొస్తుండడంతోనే పేషెంట్లు చనిపోతున్నారని ఐసోలేషన్ సెంటర్ ఇన్చార్జి అనిల్ కుమార్ చెబుతున్నారు.
సౌలతులు కరువు
ఐసోలేషన్ సెంటర్లో సరైన సౌకర్యాలు లేవని, పేషెంట్లకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం లేదని కరోనా పేషెంట్ల బంధువులు ఆరోపిస్తున్నారు. ఆక్సిజన్ అందకపోవడం వల్లే పేషెంట్లు చనిపోతున్నారని అంటున్నారు. బాత్రూంలు సరిపోవట్లేదని, వాటిని కనీసం శుభ్రం చేయడం లేదని వాపోతున్నారు. బలమైన తిండి పెట్టట్లేదని, డాక్టర్లు, స్టాఫ్ చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారని విమర్శిస్తున్నారు. తమ వారి క్షేమ సమాచారానికి బదులు ఎప్పుడు ఏ చెడు వార్త వినాల్సి వస్తోందనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సిబ్బంది కొరత
బెల్లంపల్లి సింగరేణి ఏరియా హాస్పిటల్‌ను నిరుడు మార్చిలో కరోనా ఐసోలేషన్ సెంటర్‌గా మార్చారు. వంద బెడ్లతో జనరల్ వార్డును, 20 బెడ్లతో ఐసీయూను ఏర్పాటు చేశారు. ఐసీయూలో ఒక సెంట్రల్ ఆక్సిజన్ యూనిట్‌తో పాటు 16 వెంటిలేటర్లను అందుబాటులో ఉంచారు. మొన్నటిదాకా సరిపడా డాక్టర్లు, సిబ్బంది లేకపోవడంతో ఐసీయూ నిరుపయోగంగా మారింది. ఇటీవల సీరియస్ కేసులు ఎక్కువైపోతుండడంతో 8 మంది మత్తు (అనస్థీషియా) డాక్టర్లు, ఒక డ్యూటీ డాక్టర్, చెస్ట్ ఫిజిషియన్, టెక్నీషియన్, ఐదుగురు నర్సులను నియమించారు. అయితే, జనరల్ ఫిజిషియన్లు, పల్మనాలజిస్టుల కొరత ఇంకా ఉంది. గతంలో ఇక్కడ పనిచేసిన పల్మనాలజిస్టు కుమారస్వామి నిరుడు కరోనా బారినపడి కోలుకున్నారు. కానీ, ఆ తర్వాత రిజైన్ చేశారు.
సీటీస్కాన్ లేక తిప్పలు
కరోనా పేషెంట్లలో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తీవ్రతను తెలుసుకోవడం కోసం డాక్టర్లు సీటీ స్కాన్ చేస్తుంటారు. దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేస్తుంటారు. అయితే, బెల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్లో సీటీ స్కాన్ లేక పేషెంట్లు అవస్థలు పడాల్సిన పరిస్థితులున్నాయి. సీటీ స్కాన్ అవసరమైన పేషెంట్లను మంచిర్యాలలోని సర్కార్ దవాఖానకు పంపిస్తున్నారు. సీటీ స్కాన్ కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో కనీసం సింగరేణి తరఫునైనా దానిని ఏర్పాటు చేయాలని కరోనా పేషెంట్లు, వారి బంధువులు కోరుతున్నారు.
పట్టింపే లేదు
ఐసోలేషన్ సెంటర్‌పై మొదటి నుంచి విమర్శలే ఉన్నాయి. సెంటర్ నిర్వహణ, ట్రీట్మెంట్, పేషంట్లకు సౌలతులపై ప్రజలు ఆందోళనలు చేసిసన సందర్భాలున్నాయి. ఫస్ట్‌వేవ్‌లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఐసోలేషన్ సెంటర్ సిబ్బంది గానా బజానాతో చిందులేశారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు వసతులు లేక పేషెంట్ల ప్రాణాలు పోతున్నా ప్రజాప్రతినిధులుగానీ, జిల్లా అధికారులుగానీ ఏనాడూ ఐసోలేషన్ సెంటర్‌ను పట్టించుకున్న పాపాన పోలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. అందుకే ఐసోలేషన్ సెంటర్లో ఇలాంటి పరిస్థితులున్నాయని ఆరోపిస్తున్నారు.
సీరియస్ అయినంక వస్తున్నరు
ఐసోలేషన్ సెంటర్లో అన్ని సౌలతులూ ఉన్నయ్. ఆక్సిజన్, వెంటిలేటర్లు, రెమ్డిసివిర్ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నయ్. చాలామంది ప్రైవేట్ ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నరు. కొందరు హోం క్వారంటైన్లో ఉంటున్నరు. పరిస్థితి సీరియస్ అయినంక ఐసోలేషన్ సెంటర్‌కు వస్తున్నరు. అప్పటికే పల్స్, ఆక్సిజన్ స్థాయిలు 40, 50కి పడిపోవడం వల్ల కాపాడలేకపోతున్నం. 24 గంటల్లో చనిపోయిన వారిలో ఏడుగురు ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి వచ్చిన వారే. అందులో ఆరుగురు వచ్చిన మూడు నాలుగు గంటల్లోనే మరణించారు. – డాక్టర్ అనిల్‌కుమార్, బెల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్ఇన్చార్జి
ఇవీ చనిపోయిన వారి వివరాలు
బెల్లంపల్లి బాబుక్యాంపు చెందిన మహిళ (35), జిల్లా కేంద్రంలోని ఏసీసీకి చెందిన వ్యక్తి (42), చెన్నూర్‌కు చెందిన వృద్ధుడు (75), చెన్నూర్ టౌన్‌కు చెందిన వృద్ధుడు (64), చెన్నూర్‌కు చెందిన వ్యక్తి (45), మంచిర్యాల రాంనగర్‌కు చెందిన వృద్ధురాలు (64), కాశీపేట మండలం దేవాపూర్‌కు చెందిన వ్యక్తి (58), కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరికి చెందిన మహిళ (60), ఈజ్గాం గ్రామానికి చెందిన వృద్ధుడు (70), వాంకిడికి చెందిన వృద్ధురాలు (75), నిర్మల్ జిల్లా కడెంకు చెందిన వృద్ధుడు (60), బెల్లంపల్లికి చెందిన మహిళ (43) ఐసోలేషన్ సెంటర్లో సరైన సౌకర్యాలు లేవని, పేషెంట్లకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వడం లేదని కరోనా పేషెంట్ల బంధువులు ఆరోపిస్తున్నారు. ఆక్సిజన్ అందకపోవడం వల్లే పేషెంట్లు చనిపోతున్నారని అంటున్నారు. బాత్రూంలు సరిపోవట్లేదని, వాటిని కనీసం శుభ్రం చేయడం లేదని వాపోతున్నారు. బలమైన తిండి పెట్టట్లేదని, డాక్టర్లు, స్టాఫ్ చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారని విమర్శిస్తున్నారు. తమ వారి క్షేమ సమాచారానికి బదులు ఎప్పుడు ఏ చెడు వార్త వినాల్సి వస్తోందనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సిబ్బంది కొరత
బెల్లంపల్లి సింగరేణి ఏరియా హాస్పిటల్‌ను నిరుడు మార్చిలో కరోనా ఐసోలేషన్ సెంటర్‌గా మార్చారు. వంద బెడ్లతో జనరల్ వార్డును, 20 బెడ్లతో ఐసీయూను ఏర్పాటు చేశారు. ఐసీయూలో ఒక సెంట్రల్ ఆక్సిజన్ యూనిట్‌తో పాటు 16 వెంటిలేటర్లను అందుబాటులో ఉంచారు. మొన్నటిదాకా సరిపడా డాక్టర్లు, సిబ్బంది లేకపోవడంతో ఐసీయూ నిరుపయోగంగా మారింది. ఇటీవల సీరియస్ కేసులు ఎక్కువైపోతుండడంతో 8 మంది మత్తు (అనస్థీషియా) డాక్టర్లు, ఒక డ్యూటీ డాక్టర్, చెస్ట్ ఫిజిషియన్, టెక్నీషియన్, ఐదుగురు నర్సులను నియమించారు. అయితే, జనరల్ ఫిజిషియన్లు, పల్మనాలజిస్టుల కొరత ఇంకా ఉంది. గతంలో ఇక్కడ పనిచేసిన పల్మనాలజిస్టు కుమారస్వామి నిరుడు కరోనా బారినపడి కోలుకున్నారు. కానీ, ఆ తర్వాత రిజైన్ చేశారు.
సీటీ స్కాన్ లేక తిప్పలు
కరోనా పేషెంట్లలో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తీవ్రతను తెలుసుకోవడం కోసం డాక్టర్లు సీటీ స్కాన్ చేస్తుంటారు. దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ చేస్తుంటారు. అయితే, బెల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్లో సీటీ స్కాన్ లేక పేషెంట్లు అవస్థలు పడాల్సిన పరిస్థితులున్నాయి. సీటీ స్కాన్ అవసరమైన పేషెంట్లను మంచిర్యాలలోని సర్కార్ దవాఖానకు పంపిస్తున్నారు. సీటీ స్కాన్ కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో కనీసం సింగరేణి తరఫునైనా దానిని ఏర్పాటు చేయాలని కరోనా పేషెంట్లు, వారి బంధువులు కోరుతున్నారు.
ఇవీ చనిపోయిన వారి వివరాలు
బెల్లంపల్లి బాబుక్యాంపు చెందిన మహిళ (35), జిల్లా కేంద్రంలోని ఏసీసీకి చెందిన వ్యక్తి (42), చెన్నూర్‌కు చెందిన వృద్ధుడు (75), చెన్నూర్ టౌన్‌కు చెందిన వృద్ధుడు (64), చెన్నూర్‌కు చెందిన వ్యక్తి (45), మంచిర్యాల రాంనగర్‌కు చెందిన వృద్ధురాలు (64), కాశీపేట మండలం దేవాపూర్‌కు చెందిన వ్యక్తి (58), కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరికి చెందిన మహిళ (60), ఈజ్గాం గ్రామానికి చెందిన వృద్ధుడు (70), వాంకిడికి చెందిన వృద్ధురాలు (75), నిర్మల్ జిల్లా కడెంకు చెందిన వృద్ధుడు (60), బెల్లంపల్లికి చెందిన మహిళ (43).
పట్టింపే లేదు
ఐసోలేషన్ సెంటర్‌పై మొదటి నుంచి విమర్శలే ఉన్నాయి. సెంటర్ నిర్వహణ, ట్రీట్మెంట్, పేషంట్లకు సౌలతులపై ప్రజలు ఆందోళనలు చేసిన సందర్భాలున్నాయి. ఫస్ట్ వేవ్‌లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఐసోలేషన్ సెంటర్ సిబ్బంది గానా బజానాతో చిందులేశారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు వసతులు లేక పేషెంట్ల ప్రాణాలు పోతున్నా ప్రజాప్రతినిధులుగానీ, జిల్లా అధికారులుగానీ ఏనాడూ ఐసోలేషన్ సెంటర్‌ను పట్టించుకున్న పాపాన పోలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. అందుకే ఐసోలేషన్ సెంటర్లో ఇలాంటి పరిస్థితులున్నాయని ఆరోపిస్తున్నారు.
సీరియస్ అయినంక వస్తున్నరు
ఐసోలేషన్ సెంటర్లో అన్ని సౌలతులూ ఉన్నయ్. ఆక్సిజన్, వెంటిలేటర్లు, రెమ్డిసివిర్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నయ్. చాలామంది ప్రైవేట్ ఆస్పత్రుల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నరు. కొందరు హోం క్వారంటైన్లో ఉంటున్నరు. పరిస్థితి సీరియస్ అయినంక ఐసోలేషన్ సెంటర్‌కు వస్తున్నరు. అప్పటికే పల్స్, ఆక్సిజన్ స్థాయిలు 40, 50కి పడిపోవడం వల్ల కాపాడలేకపోతున్నం. 24 గంటల్లో చనిపోయిన వారిలో ఏడుగురు ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి వచ్చిన వారే. అందులో ఆరుగురు వచ్చిన మూడు నాలుగు గంటల్లోనే మరణించారు. - డాక్టర్ అనిల్‌కుమార్, బెల్లంపల్లి ఐసోలేషన్ సెంటర్ ఇన్చార్జి