ఎయిర్ పోర్టులను పొగ మంచు కప్పేసింది.. ఢిల్లీ విమానాశ్రయంలో 170 ఫ్లైట్ లు ఆలస్యం.. 38 రద్దు..

ఎయిర్ పోర్టులను పొగ మంచు కప్పేసింది.. ఢిల్లీ విమానాశ్రయంలో 170 ఫ్లైట్ లు ఆలస్యం.. 38 రద్దు..

విమానాశ్రయాలను పొగమంచు కప్పేసింది.   ఢిల్లీ విమానాశ్రయంలో ప్రతికూల వాతావరణం కారణంగా దాదాపు 170 విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా.. 38 విమానాలను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. అలాగే శ్రీనగర్, చండీగఢ్, ఆగ్రా, లక్నో, అమృత్‌సర్, హిండన్ ..  గ్వాలియర్ విమానాశ్రయాల్లో  దట్టమైన పొగమంచు (fog) కారణంగా  జీరో విజిబిలిటీ ఉందని తెలిపారు. విమాన ప్రయాణికుల కోసం ఢిల్లీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు త‌న ట్వీట్‌లో ఓ పోస్టు చేసింది.

Update issued at 00:05 hours.
Kind attention to all flyers!#Fog #FogAlert #DelhiAirport pic.twitter.com/fQZakeRWAV

— Delhi Airport (@DelhiAirport) January 3, 2025

విమాన ప్రయాణికులకు ఎయిర్ లైన్స్ సంస్థ  కీలక అప్ డేట్ ఇచ్చింది. పొగమంచు కారణంగా కొన్ని విమానాలను రద్దు చేశామని ప్రకటించారు. ఫ్లయిట్ షెడ్యూల్ ను చూసుకొని రావాలని ప్రయాణికులకు ఎయిర్ లైన్స్ సంస్థలు తెలిపాయి.   అతి త‌క్కువ విజిబులిటీ ఉన్న స‌మ‌యంలో క్యాట్ త్రీ సౌక‌ర్యాల‌ను వినియోగిస్తుంటారు.ఒక‌వేళ విజిబులిటీ మ‌రీ అద్వానంగా ఉంటే, అప్పుడు విమానాల‌ను ర‌ద్దు చేసే అవ‌కాశాలు ఉన్నట్లు విమాన‌యాన సంస్థలు చెబుతున్నాయి. విమానాలను ల్యాండింగ్ చేయడానికి... రన్ వేపై టేకాఫ్ చేసే సమయంలో పైలట్లు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  దీంతో ఢిల్లీ విమానాశ్రయంలో దేశీయ, అంతర్జాతీయ విమానాలు రెండూ ప్రభావితమయ్యాయి.

దట్టమైన పొగమంచు కారణంగా విమానాల రాకపోకలపై ప్రభావం పడుతుందని స్పైజెట్ తెలిపింది. పొగమంచు ప్రభావం అమృత్‌సర్, గౌహతి నుంచి వచ్చే అన్ని విమానాలపై కనిపించింది. దీని కారణంగా అనేక విమానాలు ప్రభావితమయ్యాయి.  వాతావరణం ఇలాగే కొనసాగితే, తక్కువ దృశ్యమానత కారణంగా విమానాలు రద్దు చేయబడవచ్చని కూడా వెల్లడించారు. 

శుక్రవారం ( జనవరి 3)  ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దృశ్యమానత సున్నాకి తగ్గడంతో 200 విమానాలు ఆలస్యంగా నడిచాయి.  ఢిల్లీలో జనవరి 8 వరకు పొగమంచు కమ్మే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే , జనవరి 6న తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది.  ఈ రోజు ( జనవరి 4)  ఉదయం నాటికి ఢిల్లీలో ఉష్ణోగ్రత 10 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది. 

 దట్టమైన పొగమంచు కారణంగా రోడ్లపై వాహనాల వేగం కూడా నిదానంగా కనిపించింది. పొగమంచు కారణంగా వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.