ఎస్వీ శిల్ప కళాశాలలో అడ్మిషన్లకు దరఖాస్తుల ఆహ్వానం

తిరుమల తిరుపతి దేవస్థానం వారి శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ ఆలయ శిల్ప కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నారు. 2022 - 23 విద్యా సంవత్సరానికి గాను డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సు (సంప్రదాయ కళంకారి కళ)లో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తులు కళాశాలలో జూలై 11 నుండి 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను జూలై 30వ తేదీ సాయంత్రంలోపు కళాశాలలో సమర్పించాలని కోరారు. 
డిప్లొమా కోర్సులో ప్రవేశం పొందిన వారికి లక్ష రూపాయల చొప్పున బ్యాంకులో డిపాజిట్‌ చేసి ఉత్తీర్ణత సాధించిన అనంతరం నిబంధనలకు లోబడి చెల్లించడం జరుగుతుందని పేర్కొన్నారు. కోర్సులు, విద్యార్హతలు, ఇతర వివరాల కోసం www.tirumala.org వెబ్‌సైట్‌ను గానీ, కళాశాల కార్యాలయాన్ని 0877-2264637 నంబరులో పనివేళల్లో  సంప్రదించాలని కోరారు.