
భీమదేవరపల్లి,వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా రూ. 250 కోట్లతో 104 కొత్త 33/11కేవీ సబ్స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్రెడ్డి వెల్లడించారు. సోమవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూరులో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో 1504 సబ్ స్టేషన్లకు ఇంటర్లింకింగ్వ్యవస్థ త్వరలో పూర్తవుతుందని, తద్వారా నిరంతర విద్యుత్ అందనుందని పేర్కొన్నారు. ఓవర్లోడ్, డీటీఆర్, కెపాసిటీ ఇతర సమస్యలపై సిబ్బంది తక్షణమే పరిష్కరి స్తూ రైతులకు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నారని తెలిపారు.
133 కేవీ సామర్థం కలిగిన 5 పెద్ద సబ్స్టేషన్ల నిర్మాణం కూడా చేపట్టనున్నట్టు చెప్పారు. సాగుకు నోచుకోని భూముల రైతులు సోలార్విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు ముందుకొస్తే ఎంతో లాభాదాయకంగా ఉంటుందని సూచించారు. ఆయనవెంట ఎస్ఈ మధుసూదన్, డీఈ సామ్యానాయక్,ఏడీ రాజేశ్వర్రావు,ఏఈ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.