
ఖమ్మం టౌన్, వెలుగు : గాంధీ జయంతి సందర్భంగా బుధవారం మాంసం, మద్యం విక్రయాలు నిర్వహించొద్దని కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య ఆదేశాలు ఇచ్చారు. కానీ కొన్ని షాపులు ఓపెన్ చేసి చికెన్ విక్రయించారు. అలాంటి షాపుల్లో తనిఖీలు చేసిన కేఎంసీ అధికారులు నిర్వాహకులకు రూ.22 వేలు ఫైన్ విధించారు. ఈ తనిఖీల్లో శానిటేషన్ పర్యవేక్షకులు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.