ఎమ్మెల్యేలు అన్నాక క్రీడా పోటీలు ప్రారంభించడం, అందులో పార్టిసిపేట్ చేసినట్టు ఫొటోలకు ఫోజిలివ్వడం మామూలే. అదే తరహాలో ఒక ఎమ్మెల్యే క్రికెట్ మ్యాచ్‌ను ప్రారంభించాడు. ఈ సందర్భంగా తనలోని క్రీడాకారుడ్ని అందరికీ చూపాలనుకుని.. బ్యాటింగ్ చేశాడు. కానీ అదుపుతప్పి బోర్లాపడ్డారు. దీంతో గాయపడిన ఆయనను సిబ్బంది వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఒడిశాలోని కలహండి జిల్లాలో జరిగిన ఈ ఘటనలో.. నార్ల నియోజకవర్గం ఎమ్మెల్యే భూపేంద్ర సింగ్ ఇటీవల కలహండిలో క్రికెట్ మ్యాచ్‌ను ప్రారంభించారు. యువకుల హుషారు, క్రికెట్ పిచ్ చూడగానే బ్యాట్ పట్టుకోకుండా ఉండలేకపోయారు. ఒక యువకుడు బాల్ వేయగా బ్యాట్‌తో బిగ్ షాట్ కొట్టేందుకు ప్రయత్నించారు. కానీ ఇంతలోనే ఎమ్మెల్యే అదుపుతప్పి నేలపై బోర్లాపడ్డారు. దీంతో ఆయన తల, ముఖం, చేతులకు గాయాలయ్యాయి. అనంతరం వెంటనే అక్కడున్న సిబ్బంది.. ఆయన్ను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు.
ఈ వైరల్ క్లిప్ పై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.. రాజకీయ నాయకులు రాజకీయాలకు పరిమితమైతే మంచిదని కొందరు సూచించారు. క్రీడల్లో కూడా రాజకీయం చేయాలని చూస్తే ఇలాంటి పరిస్థితులే ఎదుర్కోవాల్సి ఉంటుందని మరికొందరు కామెంట్ చేశారు.
क्रिकेट खेलते गिरे विधायक, हुए जख्मी!
— Gyanendra Shukla (@gyanu999) December 29, 2023
ओडिशा के नारला के बीजेडी विधायक भूपेन्द्र सिंह कालाहांडी में एक खेल प्रतियोगिता का उद्घाटन करने गए, तभी बल्लेबाजी में हाथ आजमाने लगे, शॉट मारने की कोशिश में पिच पर जा गिरे और बुरी तरह चोटिल हो गए. अस्पताल में इलाज जारी है, वीडियो वायरल हो… pic.twitter.com/qEhLerJYG3