కరీంనగర్ టౌన్, వెలుగు: వరంగల్ కార్పోరేషన్‌తో పోలిస్తే కరీంనగర్లో స్మార్ట్ పనులు చురుగ్గా సాగుతున్నాయని స్మార్ట్ సిటీ వర్క్స్ మేనేజింగ్ రిప్రజెంటేటీవ్ ఆఫీసర్ సూర్య శ్రీనివాస్ అన్నారు. గురువారం బల్దియా హెడ్డాఫీసులో రివ్యూ మీటింగ్‌లో మేయర్ సునీల్‌రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సూర్య శ్రీనివాస్ మాట్లాడుతూ ఫీల్డ్లెవల్లో స్పీడ్‌గా వర్క్ జరుగుతోందని ప్రశంసించారు. మేయర్ మాట్లాడుతూ 49 స్మార్ట్ సిటీ పనుల్లో 90 శాతం పూర్తయ్యాయని చెప్పారు. డిసెంబర్31లోపు పెండింగ్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కమిషనర్ సేవా ఇస్లావత్, ఎస్ఈ నాగమల్లేశ్వర్ రావు, ఈఈ కిష్టప్ప, మహేంధర్, డీఈ మసూద్ అలీ పాల్గొన్నారు.