- ప్రస్తుత పరిస్థితిపై సర్వే చేయనున్న ఎన్సీబీఈ
- 2,500 చెరువులు, 355 పార్కులపై నివేదిక ఇవ్వనున్న ఎన్సీబీఈ
- రిపోర్ట్ ఆధారంగా పనులు చేపట్టాలని నిర్ణయం
హైదరాబాద్సిటీ, వెలుగు:హెచ్ఎండీఏ పరిధిలో చెరువులు, పార్కుల అభివృద్ధిపై అధికారులు దృష్టి పెట్టారు. వందల సంఖ్యలో చెరువులను, పార్కులను పరిరక్షించడంతో పాటు, ఆధునికీకరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ‘గ్రీన్బ్లూ ఇన్ఫ్రాస్ర్టక్చర్’ పేరుతో ప్రాజెక్ట్చేపట్టాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ముందు చెరువుల సంఖ్య, పార్కులను గుర్తించి వాటి పరిస్థితిపై నివేదిక రెడీ చేస్తారు. ఈ బాధ్యతలను ముంబయికి చెందిన ఎన్సీబీఈ ఇండియా అనే సంస్థకు అప్పగించారు.
సర్వే ఎలా చేస్తారంటే..
ప్రాజెక్టులో భాగంగా ముందు హెచ్ఎండీఏ నోటిఫై చేసిన 2500 చెరువులను పరిశీలిస్తారు. సమీప ప్రాంతాల నుంచి వర్షపు నీరు చెరువులోకి వస్తుందా? లేదా? ..చెరువుల పరిధిలో కాలుష్య కారక పరిశ్రమలుంటే వాటిని ఏం చేయాలి? కబ్జాలకు గురైతే పరిరక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలేమిటి? చెరువుల్లో మురుగు ఉంటే శుద్ధి చేసేందుకు ఏం చేయాలి? వంటి అంశాలను పరిశీలిస్తారు. హెచ్ఎండీఏ పరిధిలోని 355 చిన్న, పెద్ద పార్కుల పరిశీలించి కబ్జాకు గురయ్యయా? లేదా? పచ్చదనం ఉందా లేదా? అభివృద్ధి చేయడానికి తీసుకోవాల్సిన చర్యలేమిటి? వంటి అంశాలపై సర్వే చేసి నివేదిక ఇస్తారు.
ఎన్సీబీఈ నివేదిక ఆధారంగా గ్రీన్బ్లూ ఇన్ఫ్రా ప్రాజెక్టు చేపడతారు. డీపీఆర్రెడీ చేసి ఆయా పనులకు ఎంత అవుతుందో అంచనా వేస్తారు. అవసరమైతే ప్రైవేట్భాగస్వామ్యంతో ప్రాజెక్టు పూర్తి చేయాలన్న ఆలోచన కూడా ఉందని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.