అమెరికాలోనూ జై శ్రీరాం : అగ్రరాజ్యంలో హిందూయిజం

అమెరికాలో హిందువులు సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. అగ్రరాజ్యంలో హిందూమతస్థులు ..తాము హిందువులమని గర్వంగా చెప్పుకుంటున్నారు. ఆసియాఖండం నుంచి అమెరికా వెళ్లిన ప్రతీ 10 మందిలో ఒకరు హిందూమతస్థుడే ఉన్నారని..ఓ సర్వే అధ్యయనంలో వెల్లడైంది. 

ఫ్యూ రీసెర్చ్ అనే సంస్థ అమెరికాలో ఉన్న హిందువుల సంఖ్యపై అధ్యయనం చేసింది. బెషీర్ మహ్మద్, మైఖేల్ రొటోలో అనే ఇద్దరు పరిశోధకులు ఆసియా ఖండం నుంచి అమెరికాలో  ఎంత మంది హిందువులు సెటిల్ అయ్యారు.వీరిలో ఎంత మంది తాము హిందువులమని చెప్పుకుంటున్నారని అనే అంశాలపై సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.  అమెరికాలో సెటిల్ అయిన ఆసియా ఖండం ప్రజల్లోని ప్రతీ 10 మందిలో ఒకరు తాను హిందువును అని గర్వంగా చెప్పుకుంటున్నారట. మొత్తంగా భారతీయ అమెరికన్లలో మూడింట రెండొంతుల మంది తాము హిందువులమని  కాలరు ఎగరేస్తున్నారట. 

అమెరికాలో సెటిల్ అయిన భారతీయులలో ప్రతీ 10 మందిలో ఒకరు 
తాను హిందూ మతస్థుడిని అని చెప్పుకుంటున్నాడట. అంటే భారతీయ అమెరికన్లలో  11 శాతం మంది ప్రజలు తాము హిందువులమని చెబుతున్నాడని సర్వే తేల్చింది. అమెరికాలో సెటిల్ అయిన ఆసియా ఖండం ప్రజల్లోని 6 శాతం మంది తమ మతాన్ని పక్కన పెట్టి భారతీయ పురాణాలు, సంస్కృతి వంటి కారణాల వల్ల హిందూ మతానికి దగ్గరగా ఉన్నారని సర్వే పేర్కొంది. 

అమెరికాలో భారతీయులుగా గుర్తించబడిన వారిలో దాదాపు 48 శాతం మంది తాము హిందువులమని చెప్పుకుంటున్నారు. అయితే 2012లో 51 శాతం మంది హిందువులమని చెప్పుకున్నట్లు..గతంలో కంటే తగ్గిందని ప్యూ రీసెర్చ్ సెంటర్ సర్వే వెల్లడించింది. 

అంతేకాదు అమెరికాలోని 40 శాతం ఆసియా ప్రజలు తమ స్నేహితులు, ఇతర వ్యక్తులతో తాము కూడా హిందువులమే అని చెప్పుకుంటున్నారట.మరో 6 శాతం మంది ఆసియా అమెరికన్లు.. హిందూ వారసత్వ సంపద, హిందూ సంస్కృతి  సంప్రదాయలకు ఆకర్షితులై హిందువులమని పేర్కొంటున్నారట. 

అమెరికాలో సెటిల్ అయిన ఆసియా ప్రజల్లో 92 శాతం మంది దాదాపు అమెరికాలో పుట్టలేదు. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న ఆసియా ప్రజల్లో 35 శాతం మంది ఏ మతానికి చెందిన వారు కాదని..వారంతా హిందూ మతానికి దగ్గర ఉన్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. 

అమెరికాలో సెటిల్ అయిన ఆసియన్లు ఆర్థికంగా ఉన్నత స్థానంలో ఉన్నారు. అమెరికాలో ఉన్న 32 శాతం ఆసియ దేశాలకు చెందిన ప్రజల ఆదాయాన్ని గమనిస్తే..హిందువుల ఆదాయం కంటే తక్కువ. అమెరికాలోని హిందువుల ఆదాయం ఏడాదికి లక్షా 50 వేల డాలర్లు. ఆదాయంలోనే కాదు..విద్యలోనూ అమెరికాలో సెటిల్ అయిన ఆసియన్లలో  హిందువులదే పైచేయి. ఆసియా అమెరికన్లలో 22 శాతం మంది హిందువులు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉన్నారు. 

ఇక అసియన్ అమెరికన్లలో 79 శాతం మంది ప్రజలు తమ ఇండ్లలో పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తమకు తమ మతం, సంప్రదాయం చాలా ముఖ్యమని 89 శాతం మంది హిందువులు పేర్కొన్నారు. 

ఫ్యూ రీసెర్చ్ సెంటర్ 2022 జులై 5 నుంచి జనవరి 27 2023 వరకు 7006 మంది అసియా అమెరికన్లపై సర్వే నిర్వహించింది.  ఇందులో ఒక వంతు 40 వయస్సు ఉన్నవారిని ప్రశ్నించింది. మరో మూడు వంతులు అంటే దాదాపు 77 శాతం 50 ఏళ్లలోపు ఉన్నవారిని ప్రశ్నించింది. 

ALSO READ : సినిమా నా డీఎన్​ఏలోనే ఉంది..సితార ఎమోషనల్ పోస్ట్