సైబర్ నేరగాళ్ల తెలివి రోజు రోజుకు పెరిగిపోతోంది. విభిన్న పద్దతుల్లో ప్రజలను బురిడి కొట్టిస్తూ..కోట్లు కొట్టేస్తున్నారు. తాజాగా ఈమెయిల్ ద్వారా సైబర్ నేరగాళ్లు నగదు కాజేస్తున్నారు. ఈమెయిల్ బాంబు రూపంలో జనాలను దోచుకుంటున్నారు.
ఎలా దోచుకుంటున్నారంటే..
సైబర్ నేరగాళ్లు పెద్ద మొత్తంలో ఒకే చిరునామాకు ఈమెయిల్స్ పంపుతారు. మెయిల్ బాక్స్ కు వందల సంఖ్యలో మెయిల్స్ పంపుతారు. మెయిల్ బాక్స్ ఓవర్ ఫ్లో అయ్యేలా చేస్తారు. దీంతో యూజర్ ముఖ్యమైన ఈ మెయిల్ లను పట్టించుకోకుండా వీటిని ఓపెన్ చేయడం మొదలు పెడతాడు. వీటిని ఓపెన్ చేయడం ద్వారా వినియోగదారుల సమాచారాన్ని సైబర్ నేరగాళ్లు సేకరిస్తారు.
ఈ మెయిల్ బాంబు దాడి పద్దతులు
ఈమెయిల్ బాంబు దాడిలో సైబర్ నేరగాళ్లు మూడు పద్దతలను పాటిస్తున్నారు. ఇందులో ఒకటి మాస్ మెయిలింగ్, లింకింగ్ లిస్ట్, జిప్ బాంబింగ్.
ఆన్ లైన్ బ్యాంకింగ్ మోసాల నుంచి తప్పించుకోవాలంటే..
ఆన్ లైన్లో నగదు కోల్పోతే వెంటనే బ్యాంకును సంప్రదించాలి. సైబర్ క్రైం హెల్ప్ లైన్ నెంబర్ 1930 లేదా 155260 నెంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి.
- మీ బ్యాంకు అకౌంట్కు పటిష్టమైన పాస్ వర్డ్ను సెట్ చేసుకోవాలి.
- వెబ్సైట్ల ద్వారా తరచూ నగదు చెల్లింపులు చేయకూడదు.
- అకౌంట్ నుంచి నగదు డెబిట్ అయితే వెంటనే కార్డును బ్లాక్ చేయాలి
- మీ బ్యాకు అకౌంట్, పాస్ వర్డ్, ఓటీపీ, ఐడీ నెంబర్లను ఎవరికి షేర్ చేయకండి
- మీ బ్యాంకుకు సంబంధించిన అకౌంట్ నెంబర్, పాస్ వర్డ్ వంటివి ఈమెయిల్, ఫోన్లలో భద్రపర్చుకోవద్దు.
- ఆన్ లైన్లో బ్యాంకు లావాదేవీలు ముగిసిన తర్వాత వెంటనే లాగౌట్ అవ్వాలి.
- తరచూ ఇంటర్నెట్ బ్యాంకింగ్ పాస్ వర్డ్ లను మార్చుకుంటూ ఉండాలి
- మీ బ్యాంక్ అకౌంట్ ను ఎప్పుడు లాగిన్ చేశారో అప్పుడప్పుడూ చెక్ చేసుకుంటూ ఉండాలి
- ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మకం లేని లింక్స్ , వ్యక్తులు, సంస్థలు పంపిన అప్లికేషన్లను డౌన్ లోడ్ లేదా ఇన్ స్టాల్ చేసుకోవద్దు.
- భద్రత లేని వైఫై నెట్వర్క్లను ఉపయోగించవద్దు.