రూపం మార్చుకుంటున్న బెట్టింగ్ యాప్స్

రూపం మార్చుకుంటున్న  బెట్టింగ్ యాప్స్
  • బ్లాక్ చేసిన వాటిలో అక్షరం మార్చి కొత్తవి క్రియేట్
  • దర్యాప్తు సంస్థల నిఘా పెరగడంతో ఆర్గనైజర్ల కొత్త ఎత్తుగడ
  • ఢిల్లీ, ముంబై, కోల్‌‌‌‌‌‌‌‌కతా కేంద్రంగా షెల్‌‌‌‌‌‌‌‌ కంపెనీలు
  • నగదు డ్రా చేసుకునే చాన్స్ లేకుండా ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ బ్యాలెన్స్‌‌‌‌‌‌‌‌
  • ఫేక్, ఫోర్జరీ డాక్యుమెంట్లతో సొంత అకౌంట్స్​లోకి ట్రాన్స్​ఫర్
  • రెండేండ్లలో 1,298 యాప్స్‌‌‌‌‌‌‌‌ బ్లాక్‌‌‌‌‌‌‌‌ చేసిన కేంద్రం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఆన్​లైన్ బెట్టింగ్ పై దర్యాప్తు సంస్థల నిఘా పెరగడంతో ఆర్గనైజర్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. ఇల్లీగల్ యాప్స్ క్రియేట్ చేయించి అందినకాడికి దోచుకుంటున్నారు. బ్లాక్ చేసిన యాప్స్‌‌‌‌‌‌‌‌లో అక్షరం మార్చి మళ్లీ కొత్త వాటిని గూగుల్‌‌‌‌‌‌‌‌ ప్లే స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అప్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. మొదటి నాలుగు అక్షరాలు మినహా చివరి అక్షరంతో పాటు యాప్‌‌‌‌‌‌‌‌ రూపం మారుస్తున్నారు. ఈ క్రమంలోనే బెట్టింగ్‌‌‌‌‌‌‌‌, గేమింగ్‌‌‌‌‌‌‌‌ యాప్స్‌‌‌‌‌‌‌‌, వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఇలాంటి యాప్స్‌‌‌‌‌‌‌‌పై ఇప్పటికే అవగాహన ఉన్న బెట్టింగ్‌‌‌‌‌‌‌‌ రాయుళ్లకు వీటి యాక్సెస్‌‌‌‌‌‌‌‌ సులువుగా లభిస్తున్నది. రెగ్యులర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వినియోగించే యాప్ కావడంతో మొదటి అక్షరాలు ఎంటర్ చేసిన వెంటనే బెట్టింగ్‌‌‌‌‌‌‌‌లోకి ఎంటర్ అవుతున్నారు. 

వీటితో పాటు చైనా కేంద్రంగా నిర్వహిస్తున్న ఆన్‌‌‌‌‌‌‌‌లైన్ కలర్ ప్రిడిక్షన్ గేమింగ్ యాప్స్‌‌‌‌‌‌‌‌ పై పోలీసులు మరోసారి ఫోకస్‌‌‌‌‌‌‌‌ పెట్టారు. 2020, ఆగస్టులో సీసీఎస్‌‌‌‌‌‌‌‌ పోలీసులు నమోదు చేసిన కేసులో ఇప్పటికే బ్లాక్ చేసిన చైనా బెట్టింగ్‌‌‌‌‌‌‌‌, గేమింగ్ యాప్స్‌‌‌‌‌‌‌‌ రూపం మార్చుకున్నట్లు ఆధారాలు గుర్తించారు. ఇలాంటి వాటిలో రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఈ ఏడాది 108 వెబ్‌‌‌‌‌‌‌‌సైట్లను బ్లాక్ చేసింది. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా నమోదైన బెట్టింగ్‌‌‌‌‌‌‌‌ గేమింగ్‌‌‌‌‌‌‌‌ కేసులకు సంబంధించి గత రెండేండ్లలో 1,298 యాప్స్‌‌‌‌‌‌‌‌, వెబ్‌‌‌‌‌‌‌‌సైట్లను కేంద్రం బ్లాక్ చేసింది.

యాప్‌‌‌‌‌‌‌‌లో రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌, యూజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐడీతో యాక్సెస్

ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ బెట్టింగ్ నిర్వాహకులు గూగుల్‌‌‌‌‌‌‌‌ ప్లే స్టోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెబ్‌‌‌‌‌‌‌‌సైట్లలో స్పెషల్ అప్లికేషన్స్‌‌‌‌‌‌‌‌తో గేమింగ్‌‌‌‌‌‌‌‌, బెట్టింగ్‌‌‌‌‌‌‌‌ యాప్స్‌‌‌‌‌‌‌‌ క్రియేట్‌‌‌‌‌‌‌‌ చేసి అప్‌‌‌‌‌‌‌‌లోడ్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. ఇందులో కెసినో, క్రికెట్‌‌‌‌‌‌‌‌, పోకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్లేయింగ్ కార్డ్స్ సహా ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ ప్లాట్‌‌‌‌‌‌‌‌ఫామ్స్‌‌‌‌‌‌‌‌లో ఆడే ప్రతీ గేమ్‌‌‌‌‌‌‌‌ను రూపొందిస్తున్నారు. వీటిని యువత ఎక్కువగా ఉండే ఇన్​స్టాగ్రామ్​లాంటి సోషల్ మీడియాలో బెట్టింగ్‌‌‌‌‌‌‌‌ లింక్స్‌‌‌‌‌‌‌‌ సర్క్యులేట్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నారు. లింక్‌‌‌‌‌‌‌‌ ఓపెన్‌‌‌‌‌‌‌‌ చేసిన వెంటనే ఆకర్షించే యాడ్స్ వస్తున్నాయి. ఇలాంటి యాప్​లే.. సెలబ్రెటీలు, యూట్యూబర్లకు ఆదాయవనరుగా మారాయి. ఇన్​ట్రెస్ట్ చూపిన వారితో యాప్‌‌‌‌‌‌‌‌లో రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. 

ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ గేమింగ్‌‌‌‌‌‌‌‌, బెట్టింగ్‌‌‌‌‌‌‌‌లో పెద్ద మొత్తంలో డబ్బులు గెలుచుకోవచ్చని ఆశ చూపిస్తుంటారు. రిజిస్ట్రేషన్ చేయించి యూజర్ ఐడీ ఇస్తున్నారు. ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌లో పాల్గొనేవారికి ఐడీ, పాస్‌‌‌‌‌‌‌‌వర్డ్స్‌‌‌‌‌‌‌‌తో ఆర్గనైజర్లు యాప్‌‌‌‌‌‌‌‌లోకి ఎంటర్ అయ్యేందుకు యాక్సెస్ ఇస్తుంటారు. ఈ క్రమంలో బెట్టింగ్‌‌‌‌‌‌‌‌ పెట్టిన యూజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్‌‌‌‌‌‌‌‌ స్క్రీన్‌‌‌‌‌‌‌‌ షాట్స్ తీసుకుంటారు. వీటిని బ్యాంక్ అకౌంట్స్‌‌‌‌‌‌‌‌తో కలిపి చెక్‌‌‌‌‌‌‌‌ చేస్తుంటారు.

తక్కువ బెట్టింగ్‌‌‌‌‌‌‌‌ పెట్టించి గెలిపిస్తారు..  ఎక్కువ పెట్టించి ఓడిస్తారు

బెట్టింగ్‌‌‌‌‌‌‌‌లో ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిన వారి వద్ద ప్రత్యేక కాయిన్‌‌‌‌‌‌‌‌, కలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోడ్స్‌‌‌‌‌‌‌‌తో డబ్బు వసూలు చేస్తారు. నమ్మించేందుకు ముందుగా తక్కువ మొత్తంలో బెట్టింగ్ పెట్టించి గెలిపిస్తారు. గెలిచిన డబ్బు డ్రా చేసుకునేందుకు అవకాశం లేకుండా మెంబర్ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ అకౌంట్లకు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్ చేయకుండా ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో మాత్రమే బ్యాలెన్స్‌‌‌‌‌‌‌‌ చూపిస్తారు. దీంతో పాటు కమీషన్స్, రివార్డ్‌‌‌‌‌‌‌‌ పాయింట్ల పేరుతో మరికొంత మందిని జాయిన్ చేసేలా యాప్స్‌‌‌‌‌‌‌‌ ఆపరేట్‌‌‌‌‌‌‌‌ చేస్తారు. ఈ క్రమంలోనే పెద్ద మొత్తంలో బెట్టింగ్‌‌‌‌‌‌‌‌ డబ్బులు గెలుచుకున్నట్లు చూపిస్తారు. 

అయితే, తాము గెలుచుకున్న డబ్బు తమ అకౌంట్లలో డిపాజిట్ కాలేదని ప్రశ్నించిన వారిని ఓడిపోయారని తెలిపేలా యాప్స్‌‌‌‌‌‌‌‌ ఆపరేట్‌‌‌‌‌‌‌‌ చేస్తారు. ఫేక్ డాక్యుమెంట్లతో వివిధ కంపెనీలు, వ్యక్తుల పేర్లతో బ్యాంకుల్లో కరెంట్‌‌‌‌‌‌‌‌ అకౌంట్లు ఓపెన్ చేసి.. వీటితో ఒకేసారి రూ.కోట్లలో ఇతర అకౌంట్లకు డబ్బు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకుంటారు. ఇలాంటిదే ఐదేండ్ల  కింద హైదరాబాద్ సీసీఎస్‌‌‌‌‌‌‌‌లో నమోదైన కలర్ ప్రిడిక్షన్‌‌‌‌‌‌‌‌ బెట్టింగ్‌‌‌‌‌‌‌‌, గేమింగ్‌‌‌‌‌‌‌‌ యాప్స్‌‌‌‌‌‌‌‌ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. చైనాలో తయారు చేసిన 250 యాప్స్‌‌‌‌‌‌‌‌ను సైబర్ క్రైమ్ పోలీసులు సహా ఈడీ బ్లాక్ చేసింది. వీటిలోనూ అక్షరం మార్చి మళ్లీ కొత్త యాప్‌‌‌‌‌‌‌‌లను ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లోకి తెచ్చారు.

చైనా, యూఎస్‌‌‌‌‌‌‌‌ క్లౌడ్‌‌‌‌‌‌‌‌లో యాప్‌‌‌‌‌‌‌‌ సర్వర్లు.. ఢిల్లీలో ఆపరేషన్లు

చైనాకు చెందిన 8 ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌ గేమింగ్‌‌‌‌‌‌‌‌ కంపెనీలు అప్పట్లో ఢిల్లీ కేంద్రంగా ఆఫీసులు ప్రారంభించాయి. వెబ్‌‌‌‌‌‌‌‌సైట్లు, యాప్స్‌‌‌‌‌‌‌‌ డొమైన్ సర్వర్లు అంతా చైనా, యూఎస్‌‌‌‌‌‌‌‌ క్లౌడ్‌‌‌‌‌‌‌‌ నుంచి ఆపరేట్‌‌‌‌‌‌‌‌ చేశారు. బెట్టింగ్‌‌‌‌‌‌‌‌, గేమ్స్‌‌‌‌‌‌‌‌ ద్వారా వచ్చిన డబ్బును పేటీఎం, క్యాష్‌‌‌‌‌‌‌‌ ఫ్రీ గేట్‌‌‌‌‌‌‌‌వేస్‌‌‌‌‌‌‌‌ ద్వారా సేకరించారు. ఇదంతా చైనాలోని బీజింగ్‌‌‌‌‌‌‌‌ టు పవర్‌‌‌‌‌‌‌‌ అనే‌‌‌‌‌‌‌‌ కంపెనీతో కంట్రోల్‌‌‌‌‌‌‌‌ చేశారు. ‘కలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రిడిక్షన్‌‌‌‌‌‌‌‌’ పేరుతో టెలిగ్రామ్‌‌‌‌‌‌‌‌ గ్రూప్స్‌‌‌‌‌‌‌‌లో గేమింగ్‌‌‌‌‌‌‌‌ లింక్స్‌‌‌‌‌‌‌‌ పంపిస్తారు. రిజిస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకున్న వారితో రెడ్‌‌‌‌‌‌‌‌, గ్రీన్‌‌‌‌‌‌‌‌, ఆరెంజ్‌‌‌‌‌‌‌‌ ఇలా ఒక్కో గేమ్‌‌‌‌‌‌‌‌కి ఒక్కో కలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫిక్స్‌‌‌‌‌‌‌‌ చేసి మూడు కలర్ల కోడింగ్‌‌‌‌‌‌‌‌ ఇస్తారు. 

రూ.10 నుంచి మొదలుకొని మెంబర్ ఆసక్తిని బట్టి బెట్టింగ్‌‌‌‌‌‌‌‌ పెట్టిస్తారు. దర్యాప్తు సంస్థలకు చిక్కకుండా ఒకరోజు కనిపించే కలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోడ్ గేమ్ మరుసటి రోజు కనిపించకుండా మార్చేస్తారు. గుర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గావ్‌‌‌‌‌‌‌‌ కేంద్రంగా గ్రోయింగ్‌‌‌‌‌‌‌‌ ఇన్ఫోటెక్‌‌‌‌‌‌‌‌, సిలీ కన్‌‌‌‌‌‌‌‌ల్టింగ్‌‌‌‌‌‌‌‌ సర్వీసెస్, పాన్‌‌‌‌‌‌‌‌ యన్‌‌‌‌‌‌‌‌ టెక్నాలజీ సర్వీసెస్, లింక్యూన్‌‌‌‌‌‌‌‌ టెక్‌‌‌‌‌‌‌‌, డొకిపే, స్పాట్‌‌‌‌‌‌‌‌పే, డైసిలింక్‌‌‌‌‌‌‌‌, హుహౌ ఫైనాన్సియల్‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌ పేర్లతో కంపెనీలను రిజిస్టర్ చేయిస్తారు. వీటిలో ముంబై, గుర్​గుర్​గావ్​కు చెందిన ధీరజ్‌‌‌‌‌‌‌‌ సర్కార్‌‌‌‌‌‌‌‌,‌‌‌‌‌‌‌‌ ఢిల్లీకి చెందిన అంకిత్‌‌‌‌‌‌‌‌ కపూర్‌‌‌‌‌‌‌‌, నీరజ్‌‌‌‌‌‌‌‌ తులిను డైరెక్టర్లుగా నియమించారు. వీరితో గేమింగ్‌‌‌‌‌‌‌‌ యాప్స్‌‌‌‌‌‌‌‌ దందా నిర్వహించారు.