భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా కొత్తగూడెం పట్టణంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో బుధవారం పోలీసులు ఆన్లైన్ ఓపెన్ హౌజ్నిర్వహించారు. ఆయుధాల ప్రదర్శనలో భాగంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పలు కాలేజీలు, స్కూళ్ల స్టూడెంట్స్‌కు ఆన్ లైన్ ద్వారా ఓపెన్ హౌజ్ నిర్వహిస్తున్నామని డీఎస్పీ రెహమాన్ పేర్కొన్నారు.
పోలీస్ శాఖలో ఉపయోగిస్తున్న పలు రకాల వెపన్స్, డిస్పోజల్ సామగ్రి, గ్రేనెడ్స్ గురించి పోలీసులు వివరించారు. షీటీమ్స్ ద్వారా అందిస్తున్న సేవలను తెలిపారు. ఓపెన్ హౌజ్‌లో మందుపాతర్లు, డ్రగ్స్‌తో పాటు దొంగలను పట్టుకోవడంలో కీలక భూమిక పోషిస్తున్న పోలీస్ డాగ్స్ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈ ప్రోగ్రాంలో ఏఆర్ డీఎస్పీ సత్యనారాయణ, సీఐ కరుణాకర్, అడ్మిన్ ఆర్ఐ లాల్‌బాబు పాల్గొన్నారు.