టూల్స్ గాడ్జెట్స్ ..బేబీ టెడ్డీ

టూల్స్ గాడ్జెట్స్ ..బేబీ టెడ్డీ

బేబీ టెడ్డీ

ఎదుగుతున్న పిల్లలకు ప్రతి విషయాన్ని నేర్పించాలి. అన్నం తినడం దగ్గర్నించి టాయిలెట్‌‌‌‌ సీట్‌‌మీద ఎలా కూర్చోవాలి అనేవరకు అన్నీ నేర్పించాలి. కానీ.. చాలా ఇండ్లలో ఉండే టాయిలెట్‌‌ సీట్‌‌పిల్లలు కూర్చోవడానికి వీలుగా ఉండదు. దాంతో పిల్లలు దానిమీద కూర్చునేందుకు భయపడుతుంటారు. అలాంటివాళ్ల కోసం బేబీ టెడ్డీ అనే కంపెనీ ప్రత్యేకంగా ల్యాడర్‌‌‌‌తో ఉన్న టాయిలెట్‌‌సీట్‌‌కవర్‌‌‌‌ని మార్కెట్​లోకి తీసుకొచ్చింది. దీన్ని అడల్ట్ సీట్ పైన ఫిక్స్ చేస్తే చాలు. దీనికి ఉండే మెట్ల ద్వారా పిల్లలు సీట్‌‌పైకి ఈజీగా ఎక్కొచ్చు. అవే మెట్ల మీద కాలు కూడా పెట్టుకోవచ్చు. పైగా కవర్‌‌‌‌ ఉండడం వల్ల సీటు చిన్నగా కనిపిస్తుంది. అంతేకాదు ఈ ట్రైనింగ్‌‌ సీట్‌‌ జిరాఫీ బొమ్మ ఆకారంలో ఉంటుంది. దాని చెవులు చిన్న హ్యాండిల్స్‌‌లా ఉండడంతో పిల్లలు పట్టుకునేందుకు గ్రిప్‌‌లా పనికొస్తాయి. యాంటీ స్లిప్ స్టెప్ వల్ల పిల్లలు జారిపడే అవకాశం తక్కువ. ఒకటి నుంచి ఎనిమిదేండ్ల మధ్య వయసున్న పిల్లలకు సరిపోయేలా రెండు లెవల్స్‌‌లో ఎత్తు అడ్జెస్ట్‌‌ చేసుకోవచ్చు. 

ధర : 1,560 రూపాయలు 

మిర్రర్‌‌ లైట్స్‌

బాత్‌‌‌‌రూంలో అద్దం ఒకవైపు ఉంటే లైట్‌‌మరో వైపు ఉంటుంది. దానివల్ల ముఖం ఒక వైపు మాత్రమే కనిపిస్తుంది. లేదంటే మసకగా కనిపిస్తుంది. అలాంటప్పుడు ఈ లైట్లను అద్దానికి అతికించాలి. వీటిని ప్రత్యేకంగా  బాత్‌‌రూంలో ఉండే అద్దం కోసమే తయారుచేశారు. మూడు కలర్ మోడ్‌‌లతో ట్యూన్‌‌ చేసుకోవచ్చు. వామ్​ వైట్ (3000k), డేలైట్ వైట్ (4000k), కూల్ వైట్ (6500k)లా వాడుకోవచ్చు. బ్రైట్‌‌నెస్‌‌ని తొమ్మది లెవల్స్‌‌లో అడ్జెస్ట్‌‌ చేసుకోవచ్చు. ఈ సెట్‌‌లో 120 డిగ్రీల బీమ్ యాంగిల్‌‌తో 10 ఎల్‌‌ఈడీ లైట్లు వస్తాయి. ఈజీగా ఇన్‌‌స్టాల్‌‌ చేసుకోవచ్చు. యూఎస్‌‌బీ పోర్ట్‌‌కి కేబుల్‌‌ని కనెక్ట్​ చేస్తే లైట్లు వెలుగుతాయి. లైట్లను ఎక్కడ కావాలంటే అక్కడ అతికించుకునేలా 2 సైడ్ టేప్‌‌ ఉంటుంది. లైట్లను తీసేసినా గమ్‌‌ అద్దానికి అతుక్కోదు. మరకలు పడవు. దీన్ని మొబైల్‌‌ఛార్జర్‌‌‌‌వాల్ సాకెట్, పవర్ బ్యాంక్, ల్యాప్‌‌టాప్ యూఎస్‌‌బీ ఇంటర్‌‌ఫేస్‌‌లాంటి వాటికి కనెక్ట్ చేసుకోవచ్చు. 

ధర : 999 రూపాయలు 

మేట్రస్‌ లిఫ్టర్‌‌

బెడ్‌‌‌‌మీద బెడ్‌‌షీట్ వేయడం చాలా చిన్న పనే. కానీ.. చిరాకు తెప్పించే పని. చిన్న పిల్లలున్న ఇండ్లలో అయితే.. పదే పదే బెడ్​షీట్‌‌ని సరిచేయాల్సి వస్తుంది. బెడ్‌‌షీట్ వేసిన ప్రతిసారి బెడ్‌‌ని పైకి లేపాలి. కానీ.. ఈ టూల్‌‌చేతిలో ఉంటే క్షణాల్లో బెడ్‌‌షీట్‌‌ వేయొచ్చు. ఈ మేట్రస్ లిఫ్టర్ టూల్‌‌ని ప్రత్యేకంగా బెడ్‌‌షీట్స్​ వేసేందుకే తయారుచేశారు. బెడ్‌‌షీట్‌‌ వేశాక దీంతో ఇన్‌‌సర్ట్‌‌ చేస్తే చాలు. ఈ టూల్‌‌ని హై క్వాలిటీ ఏబీఎస్‌‌మెటీరియల్‌‌తో తయారుచేశారు. దీన్ని జెడ్‌‌.ఎమ్.ఎమ్‌‌. అనే కంపెనీ మార్కెట్‌‌లోకి తెచ్చింది. 

ధర : 244 రూపాయలు 

టాయిలెట్‌ కన్వర్టర్‌‌

పెద్దవాళ్లు లేదా యాక్సిడెంట్‌‌‌‌‌‌‌‌అయ్యి కాలు మలవలేనివాళ్లు ఇండియన్ టాయిలెట్స్‌‌వాడటం కష్టం. అలాగని వెస్టర్న్​ టాయిలెట్‌‌ని వెంటనే ఏర్పాటుచేసుకోవాలంటే ఖర్చుతో కూడుకున్నపని. అందుకే ఇండియన్ టాయిలెట్‌‌ని వెస్టర్న్​ టాయిలెట్‌‌గా మార్చడానికి అనేక రకాల గాడ్జెట్స్‌‌అందుబాటులో ఉన్నాయి. వాటిలో ఒకటి వీయ్వా(veayva) కన్వర్టర్‌‌.  ఇది హెవీ డ్యూటీ ప్లాస్టిక్‌‌తో తయారుచేసిన కమోడ్ చైర్ కమ్ స్టూల్. ఐదేండ్ల వారంటీ ఉంది దీనికి. ప్లాస్టిక్‌‌తో తయారుచేయడం వల్ల బరువు కూడా తక్కువగా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి పక్కన పెట్టేయొచ్చు. పెద్దవాళ్లు, పిల్లలు, జబ్బు పడిన వాళ్లు, గర్భిణీలు వాడేందుకు పనికొస్తుంది.

 ధర : 2,199 రూపాయలు