ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలి : పి జయలక్ష్మి

ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించాలి : పి జయలక్ష్మి

వనపర్తి టౌన్, వెలుగు : ఆశా కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఆశ వర్కర్స్  యూనియన్  రాష్ట్ర అధ్యక్షురాలు పి జయలక్ష్మి కోరారు. సోమవారం కలెక్టరేట్​ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆశ వర్కర్లతో బీపీ, షుగర్  టెస్టులు చేయించడం సరికాదన్నారు. ఈ పరీక్షలు ల్యాబ్  టెక్నీషియన్లు మాత్రమే చేయాలన్నారు. ఎంసీహెచ్ లో ఆశాలకు రెస్ట్ రూమ్  కేటాయించాలని, ప్రతి నెలా ఆశాలకు రూ.18 వేలు వేతనం ఇవ్వాలని డిమాండ్  చేశారు. పీఎఫ్, ఈఎస్ఐ,  ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని పండుగ, ఇతర సెలవులు ఇవ్వాలని కోరారు. అనంతరం కలెక్టర్  ఆదర్శ్  సురభికి వినతిపత్రం అందజేశారు. మండ్ల  రాజు, పుట్ట ఆంజనేయులు, నిక్సన్, బుచ్చమ్మ,  సునీత, భాగ్య , ఇందిర, సత్యమ్మ పాల్గొన్నారు.