Ganesh Chaturthi 2024 : విదేశాల్లోనూ వినాయకుడు చాలా ఫేమస్: ఆ దేశాలు ఇవే

Ganesh Chaturthi 2024 :   విదేశాల్లోనూ వినాయకుడు చాలా ఫేమస్: ఆ దేశాలు ఇవే

 తొలి పూజలందుకునే ఇలవేలుపుగా ఏకదంతునికి పేరు. గ‌ణ‌ప‌తిని దేవ, మానవ గణాలకు అధినాయకుడిగా భావిస్తారు. ‘గణానాం త్వా గణపతిగ్ం హవా మహే’ అని మంత్రాలు పూజల్లో ఆయనకు అగ్రస్థానం ఇచ్చాయి. శివ, విష్ణు కల్యాణాల్లో సైతం తొలుత గణపతిని కొలవడం ఆనవాయితీ. ఇండ్లల్లో జరిగే సాధారణ నోముల నుంచి వైదిక యాగాల వరకు మొదటి పూజ వినాయ‌కుడిదే. ఆదిగురువు గణపతికి అనేక దేశాల్లో దేవాలయాలు నిర్మించి పూజిస్తున్నారు. నేడు అవి ఆధ్యాత్మిక కేంద్రాలుగా భాసిల్లుతున్నాయి.

థాయ్‌లాండ్‌: వినాయకుణ్ణి థాయ్‌లాండ్‌లో ‘ఫ్రా ఫికనెట్‌’ అని పిలుస్తారు. బ్యాంకాక్‌కు చెందిన ల్యూంగ్‌ పొర్‌ అనే బౌద్ధ భిక్షువు గణపతికి ఆలయాన్ని నిర్మించమని ప్రభుత్వాన్ని కోరాడు. దానికోసం తన భూమిని విరాళంగా ఇచ్చాడు. కొంతమంది దాతల సహకారంతో ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తిచేసింది. ఇందులో థాయ్‌లాండ్‌లోనే అతి పెద్ద వినాయక విగ్రహాలు ఉన్నాయి. అందులో ఒక విగ్రహం 15 మీటర్ల ఎత్తు, 9 మీటర్ల వెడల్పు ఉంటుంది. మరో విగ్రహాన్ని 2010లో చెక్కారు. ఇది 9 మీటర్ల ఎత్తు, 15 మీటర్ల వెడల్పు ఉంటుంది.


థాయ్​లాండ్​ ప్రజలు  ప్రజలు విఘ్నేశుడిని సక్సెస్ కి చిరునామాగా భావిస్తారు. ఆర్ట్స్, ఎడ్యుకేషన్, ట్రేడ్ (వ్యాపారం).. ఇలా ఏ రంగంలో అయినా ప్రా ఫికనెట్ విఘ్నేశుడికి ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. గుళ్లలోనే కాదు.. ప్రతీ ఇళ్లలోనూ ప్రత్యేక పూజలు చేస్తారు. . థాయ్​ లాండ్ ఫైన్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ ఎంబ్లమ్లో గణేశుడి రూపం ఉంటుంది. 19వ శతాబ్దంలో మన దేశం నుంచి ఒక ప్రతిమను సిలోమ్లో ని 'వాట్ ప్రా శ్రీ ఉమాదేవి' టెంపుల్లో ఉంచారు. ఈ గుడిలో ప్రతీ ఏటా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.  థాయ్​లాండ్​ కొన్నిచోట్ల విఘ్నేశుడి పూజా విధానంలో ప్రత్యేకమైన శైలి కనిపిస్తుంది. పని సక్సెస్ అయితే స్వీట్స్, ఫ్రూట్స్​ దేవుడికి నివేదనగా సమర్పించి  పూజలు చేసి ఊరేగిస్తారు. ఒకవేళ పని జరగకపోతే దేవుడి ఫొటో, విగ్రహాన్ని రివర్స్​లో  వేలాడదీసి తమ బాధను వెళ్లగక్కుతారు. ఈ దేశంలో బిజినెస్ గాడ్'గా వినాయకుడికి మరొక పేరుంది. అందుకే బ్యాంకాక్ సెంట్రల్  వరల్డ్ బిల్డింగ్ బయట కూడా కొలువై పూజలు  అందుకుంటున్నాడు థాయ్లా లాండ్ వినాయకుడు

డ్యూయెల్ వినాయకుడు .. జపాన్ లో కాంగిటెన్

ప్రపంచంలోనే అత్యాధునిక సాంకేతికత కలిగిన దేశం జపాన్. ఇక్కడ కూడా గణేషుడిని పూజిస్తారు. ఇక్కడ గణపతిని 'కాంగిటెన్' అని పిలుస్తారు. దీని అర్థం 'ఆనంద దేవుడు' అని. ఇక్కడ శ్రీ గణేష్ ని అనేక రూపాల్లో పూజిస్తారు. ముఖ్యంగా నాలుగు చేతుల గణపతిని ఇక్కడ ఎక్కువగా పూజిస్తారు

జపాన్లో 'కాంగి-టెన్'గా పూజలు అందుకుంటున్న విఘ్నేశుడు చాలా పవర్ఫుల్ అని భక్తుల నమ్మకం. మంచికి, సంతోషానికి, సంపదకు ప్రతీకగా కాంగిటెన్ దేవుడ్ని భావిస్తారు జపాన్ ప్రజలు. ముఖ్యంగా జపనీస్ బుద్ధిజమ్ పాటించే షింగోస్. తెండై స్కూల్స్ కి చెందినవాళ్లు కాంగిటెన్ను ఆరాధిస్తుంటారు. వీళ్లు పవిత్రతకు ప్రతీకగా ఈ దేవుడ్ని భావిస్తారు. కాంగిటెన్ వినాయకుడి రూపం మాదిరిగానే ఉంటుంది. కానీ, డ్యుయెల్ కాంగిటెన్ రూపం ఎక్కువ పాపులర్ ఇక్కడ. మేల్-ఫీమేల్ హ్యూమన్ బాడీ ఏనుగు తలతో ఉంటుంది డ్యూయెల్. కాంగిటెన్ విగ్రహం. ప్రతీ గుడి బయట కాంగిటెన్ ప్రతిమ కచ్చితంగా ఉంటుంది. అందుకే కాంగిటెన్ ను ఆలయ రక్షకుడిగా పిలుస్తారు భక్తులు. అంతేకాదు అదృష్టాన్ని తెచ్చిపెట్టే దేవుడిగా నమ్ముతారు. కాబట్టే సినిమా వాళ్ల దగ్గరి నుంచి పొలిటీషియన్స్, బిజినెస్ మెన్, ఆఖరికి గ్యాంబ్లర్స్ కూడా కాంగిటెనికి పూజలు చేస్తుంటారు. రైస్ వైన్, ముల్లంగి, బన్ను దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తుంటారు.   పూజ ముగిశాక ఒక కవర్లో ప్యాక్ చేసి ఆ విగ్రహాలను భద్రంగా దాచిపెడతారు. ఎందుకంటే అదృష్టం కోసం ఆ విగ్రహాలను దొంగతనం చేస్తుంటారు కొందరు.

జపాన్ మొత్తంలో రెండు వందలకు పైగా కాంగిటెన్ ఆలయాలు ఉన్నాయి. కానీ, ఇకోమా పర్వతం మీద ఉన్న 'హోజాన్-జీ' టెంపుల్ మాత్రం చాలా ప్రత్యేకం. ఆరో శతాబ్దానికి చెందిన ఈ గుడి కొన్ని వందల సంవత్సరాల పాటు పూజలు అందుకుంది. భూకంపం తర్వాత వేల సంవత్సరాల పాటు కొండచరియల కింద ఉండిపోయింది. తిరిగి 17వ శతాబ్దంలో ప్రపంచానికి  ప్రపంచానికి ఈ ఆలయం ఉనికి తెలిసింది.

అమెరికా: అమెరికాలోని న్యూయార్క్‌లో ‘శ్రీ మహావల్లభ గణపతి ఆలయం’ ప్రసిద్ధి. అక్కడ నిర్మించిన మొట్టమొదటి హిందూ దేవాలయం ఇదే కావడం విశేషం. ఈ ఆలయాన్ని స్థానికులు ‘ఫ్లషింగ్‌ టెంపుల్‌’అని పిలుస్తారు. అమెరికాలో చాలాచోట్ల లంబోదరునికి ఆలయాలున్నాయి.

సింగపూర్‌ : సింగపూర్‌లోని సిలాన్‌ రోడ్డులో ‘శ్రీ సెంపెగ వినాయగర్‌’ ఆలయం ఉంది. చోళ రాజుల నిర్మాణ శైలిలో నిర్మితమైన దీనికి 162 ఏండ్ల చరిత్ర ఉన్నది.


ఐర్లాండ్ : బెర్లిన్‌కు చెందిన విక్టర్‌ లాంగ్‌హెల్డ్ద్‌కు ఆధ్యాత్మిక యాత్రలు చేయడమంటే చాలా ఇష్టం. ఆసియాలో పర్యటించినపుడు వినాయకుడి భక్తుడిగా మారాడు. వినాయకుడి మీద ఉన్న భక్తితో వివిధ భంగిమల్లో విగ్రహాలను చెక్కించాడు. వీటిని ఐర్లాండ్‌లోని కౌంటీ విక్లోకు సమీపంలోని ‘విక్టోరియా వే’ పార్కులో ప్రతిష్ఠించాడు. తమిళనాడుకు చెందిన భారతీయ శిల్పకారులు ఈ విగ్రహాలను చెక్కారు. విగ్రహాల కోసం గ్రానైట్‌ శిలను ఉపయోగించారు. ఒక్కో శిల్పాన్ని చెక్కడానికి ఐదుగురు శిల్పులు దాదాపు ఏడాదిపాటు శ్రమించారు. ఒక్కో విగ్రహం 3 నుంచి 5 అడుగుల ఎత్తు ఉంటుంది.


నేపాల్‌లో తంత్ర గణపతి : నేపాల్‌లో హిందూ దేవుళ్ల ఆలయాలు కోకొల్లలు. గణపతి గుళ్లూ ఎక్కువే! అక్కడి వారు తాంత్రిక ఉపాసనలో విఘ్నేశ్వరుడిని ఎక్కువగా ఆరాధిస్తుంటారు. నేపాల్‌లోని ఆలయాల్లో కనిపించే గణపయ్య విగ్రహం కాస్త భిన్నంగా ఉంటుంది. ఏటవాలు కళ్లతో ఉంటాడు. విగ్రహం చేతుల్లో మొక్కలు ధరించి ఉండటం విశేషం. ప్రకృతి ప్రేమికులు గణపతిని పంటల దేవుడిగా భావిస్తారు.

మయన్మార్‌లో బ్రహ్మగా..వినాయకుడు అంటే మనం శివపార్వతుల తనయుడిగా కొలుస్తాం. కానీ, మయన్మార్‌లో విఘ్నేశ్వరుడిని బ్రహ్మగా భావిస్తారు. అందుకు ఓ పురాతన గాథ కూడా ప్రచారంలో ఉంది. బ్రహ్మదేవుడి శిరస్సు భంగం అయినప్పుడు.. ఏనుగు తలను అతికించారనీ.. అలా బ్రహ్మ దేవుడు కాస్తా గజాననుడిగా మారాడని విశ్వసిస్తారు. నేటికీ మయన్మార్‌లో వినాయక చవితికి గణపతిని పరబ్రహ్మగా పూజిస్తుంటారు. వినాయక చవితి సమయంలో వారం రోజులు విశేష పూజలు నిర్వహిస్తారు.