సెమిస్టర్పరిక్షలకు అనుమతించాలని ఓయూ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. 75 శాతం హాజరు ఉంటేనే తమను సెమిస్టర్ ఎగ్జామ్స్కు అనుమతిస్తామని ప్రిన్సిపాల్ కాశిం ఇబ్బందులకు గురి చేస్తున్నాడని విద్యార్థులు ఓయూ ప్రధాన రహదారిపై బైఠాయించారు. కొంతమంది విద్యార్థులు వివిధ రకాల పోటీపరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు.
Also Read :- హైదరాబాద్ ఎల్బీ నగర్లో విషాదం
అలాంటి వారు 75% అటెండెన్స్ మైంటైన్ చేయాలని ఒత్తిడికి గురిచేస్తున్నాడని వాపోయారు. గ్రూప్ 2 కి ప్రిపేర్ అవుతున్న వారు 75% అటెండెన్స్ ఎలా మెంటేన్ చేస్తామని ప్రశ్నించారు. తక్షణమే సెమిస్టర్ ఎగ్జామ్ ఫీజు కట్టించుకొని పరీక్షలకు అనుమతించే వరకు నిరసన కొనసాగిస్తామని విద్యార్థులు డిమాండ్ చేశారు.