జార్ఖండ్ సీఎంగా మళ్లీ హేమంత్ సోరేన్..? 

జార్ఖండ్ సీఎంగా మళ్లీ హేమంత్ సోరేన్..? 

జార్ఖండ్ లో జరుగుతున్న ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే..జార్ఖండ్ సీఎంగా మళ్లీ హేమంత్ సోరేన్ కనబడుతోంది. రాంచీలోని జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరేన్ నివాసంలో జరిగిన ఇండియా బ్లాక్ ఎమ్మెల్యే అఖిల పక్ష సమావేశంలో.. జార్ఖండ్ సీఎం గా మళ్లీ జెఎంఎం నేతను తిరిగి ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. బుధవారం (జూన్ 3) హేమంత్ సోరేన్ నివాసంలో జరిగిన పరిణామాన్ని బట్టి ప్రస్తుత సీఎం చంపై సోరన్ ఎప్పుడైనా రాజీనామా సమర్పించే అవకాశం ఉంది. 

శాసన సభా పక్ష సమావేశానికి ముందుకు జార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరేన్ భార్య కలప్న ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వచ్చాయి. అయితే బుధవారం జరగాల్సిన కొత్తగా ఎంపిక 1500 మంది ప్రభుత్వ టీచర్ల నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంతో సహా అన్ని కార్యక్రమాలు రద్దు చేయడంతో జార్ఖండ్ సీఎం మారే అవకాశాలపై ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి. 

ఐదు నెలల క్రితం   భూ కుంభకోణం మనీలాండరింగ్ కేసులో  ఆరోపణలతో అరెస్ట్ అయిన జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరేన్ ను బిర్సా ముండా జైలులో ఉంచారు. సీఎం పదవికి రాజీనామా చేసిన కొద్ది నిమిషాలలకే ఆయనను జనవరి 31న రాంచీ రాజ్ భవన్ లో ఈడీ అరెస్ట్ చేసింది. హేమంత్ సోరేన్ కు రాంచీ హైకోర్టు జూన్ 28న బెయిల్ మంజూరు చేసింది. అదే రోజు జైలునుంచి బయటికి వచ్చారు .