
- మండిపడుతున్న నెటిజన్లు
న్యూఢిల్లీ: పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడితో ఇప్పటికే దేశమంతా ఆగ్రహంగా ఉంది. దాడి తర్వాత ఓ ముస్లిం వ్యక్తి ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ ఆఫీసులోకి కేక్ తీసుకొని ప్రవేశించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా నెటిజన్లు ఆ యువకుడి తీరుపై మండిపడుతున్నారు. పహల్గాంలో అమాయకులను చంపి సెలబ్రేట్ చేసుకుంటున్నారని ఫైర్ అయ్యారు.
కేక్ తీసుకొని వెళ్తున్న ఆ యువకుడిని పాక్ హైకమిషన్ ప్రాంగణంలో మీడియా అడ్డుకుని పలు ప్రశ్నలు వేసింది. ‘‘ఆ బాక్సులో ఏముంది? చూస్తే కేక్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకు కేక్ తీసుకుని పోతున్నారు? ఈ టైంలో సెలబ్రేట్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? మీరు పాకిస్తాన్ హైకమిషన్ కు చెందిన వ్యక్తా?” అని మీడియా ప్రతినిధులు ఆ వ్యక్తిని అడిగారు. అయితే, అతను జవాబు ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.