నా భర్తను చంపి.. టెర్రరిస్టులు నవ్వుకున్నరు

నా భర్తను చంపి.. టెర్రరిస్టులు నవ్వుకున్నరు
  • పహల్గాం దాడిని వివరించిన సూరత్‌‌‌‌‌‌‌‌ మహిళ

న్యూఢిల్లీ: కాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పహల్గాంలో టెర్రరిస్టులు హిందువులను చంపి నవ్వుకుంటూ ఎంజాయ్ చేశారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. సూరత్‌‌‌‌‌‌‌‌కు చెందిన శైలేష్‌‌‌‌‌‌‌‌ కలాథియా తన భార్యతో కలిసి పహల్గాంకు వెళ్లారు. అక్కడ జరిగిన టెర్రరిస్టుల కాల్పుల్లో ఆమె తన భర్తను పొగొట్టుకుంది. గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘మొదట ఓ టెర్రరిస్టు మా దగ్గరికి వచ్చాడు. నా భర్త హిందువు అని తెలుసుకున్న తర్వాత ఆయన్ని పాయింట్‌‌‌‌‌‌‌‌ బ్లాక్‌‌‌‌‌‌‌‌లో కాల్చి చంపాడు. నా భర్తలాగే ఇతర హిందు పురుషులను కూడా వారి పిల్లల ముందే షూట్‌‌‌‌‌‌‌‌ చేశాడు.

 నా భర్తను షూట్‌‌‌‌‌‌‌‌ చేసిన తర్వాత ఆయన ప్రాణాలు పోయే వరకు ఆ టెర్రరిస్టు అక్కడే నవ్వుకుంటూ ఉన్నాడు”అని ఆమె చెప్పింది. శైలేష్‌‌‌‌‌‌‌‌ కలాథియా కుమారుడు నక్ష్ మాట్లాడుతూ.. ‘‘మాకు తుపాకీ పేలుళ్ల శబ్దం వినిపించగానే 20 నుంచి 30 మంది టూరిస్టులం దాక్కోవడానికి పరిగెత్తాం. ఇద్దరు టెర్రరిస్టులు మమ్మల్ని అడ్డుకున్నారు. తర్వాత మా మతం గురించి అడిగారు. హిందువులను, ముస్లింలను రెండు గ్రూపులుగా డివైడ్‌‌‌‌‌‌‌‌ చేశారు. తర్వాత కల్మా చదవమని అడిగారు. అది చదివిన ముస్లింలను వదిలేశారు. అది చదవలేని హిందువులను మా నాన్నతో సహా అందరినీ కాల్చి చంపి, పారిపోయారు. నన్ను కూడా చంపుతారేమోనని భయపడ్డాను.. కానీ, ప్రాణాలతో బయటపడ్డాను”అని వివరించాడు. శైలేష్‌‌‌‌‌‌‌‌తో పాటు ముగ్గురు గుజరాత్‌‌‌‌‌‌‌‌ వాసులను కూడా వారి కుటుంబసభ్యుల ముందే టెర్రరిస్టులు దారుణంగా కాల్చి చంపారు.