
- అందులో టూరిస్టులపై టెర్రరిస్టుల కాల్పుల దృశ్యాలు
న్యూఢిల్లీ: పహల్గాం టెర్రర్ అటాక్ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి గురువారం బయటికొచ్చింది. ఈ వీడియోలో.. గుల్మార్గ్ ఏరియాలోని బైసరాన్ మైదానంలో టెర్రరిస్టులు అమాయక టూరిస్టులను చుట్టుముట్టి వారిపై కాల్పులు జరిపిన క్షణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గన్‌షాట్‌ల శబ్దాలు, టూరిస్టులు భయంతో పెట్టిన కేకలతో పాటు వారి చుట్టూ పడి ఉన్న డెడ్ బాడీల దృశ్యాలు కూడా ఉన్నాయి. సరైనా రోడ్డు మార్గం లేకపోవడంతో భద్రతా దళాలు ఘటనాస్థలానికి చేరుకోవడానికి 40 నిమిషాలు పట్టింది. ఈ దాడి కాశ్మీర్ టూరిజంపై తీవ్ర ప్రభావం చూపింది. చాలా మంది టూరిస్టులు కాశ్మీర్ విడిచి సొంత ప్రాంతాలకు బయలుదేరారు.