భారత్ 114.. పాకిస్తాన్ 114... : మరి ICC ర్యాంకింగ్స్ లో పాక్ అగ్రస్థానం ఎలా..?

భారత్ 114.. పాకిస్తాన్ 114... : మరి ICC ర్యాంకింగ్స్ లో పాక్ అగ్రస్థానం ఎలా..?

ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్ లో 114 పాయింట్లతో భారత్ రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు 114 పాయింట్లతో ఉన్న పాకిస్థాన్ మాత్రం ర్యాంక్ ని సొంతం చేసుకుంది. రెండు జట్లకు ఒకే పాయింట్లు ఉన్నా పాకిస్థాన్ జట్టు కి అగ్రస్థానం దక్కడం సగటు భారత అభిమానులకు ఏ మాత్రం  నచ్చడం లేదు. మరి పాక్ కి ఐసీసీ ఇలా టాప్ ర్యాంక్ కట్టబెట్టడానికి కారణం ఏంటి.?  

అందుకే పాక్ నెంబర్ వన్

సాధారణంగా ఐసీసీ ర్యాంకింగ్స్ లో పాయింట్స్ ఉంటాయని మాత్రమే అందరికీ తెలుసు. కానీ డెసిమల్స్ లో కూడా ర్యాంకింగ్స్ లో తేడాలుంటాయి. ప్రస్తుతం పాకిస్థాన్ ఖాతాలో 114.889 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. మరోవైపు టీమిండియాకు 114.559 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. దీంతో పాక్ కన్నా భారత్ కేవలం 0.24 పాయింట్స్ వెనకపడి ఉంది. ఆసియా కప్ గెలిచినా సూపర్-4 లో బంగ్లాదేశ్ మీద భారత్ ఓడిపోవడంతో రెండో స్థానానికి పడిపోయింది. ఇక ఆస్ట్రేలియా దక్షిణాఫ్రికాపై చివరి మూడు వన్డేలు ఓడిపోవడం పాక్ కి కలిసి వచ్చింది. 

ALSO READ: మహిళలు ఉద్యోగం చేస్తే సమాజం నాశనమే!: బంగ్లా క్రికెటర్

నెంబర్ వన్ అయ్యే అవకాశం

ఆసియా కప్ విజయానందంలో ఉన్న భారత్ ప్రస్తుతం స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్ కి సిద్ధమవుతుంది. ఈ నెల 22 నుంచి మూడు వన్డేల సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్ ఎవరు గెలిస్తే వారు నెంబర్ వన్ అయ్యే అవకాశం ఉంది. టెస్టుల్లో 264 పాయింట్లతో, టీ20ల్లో 118 పాయింట్లతో భారత్ నంబర్‌వన్ జట్టుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by CricTracker (@crictracker)