"బ్రా" వేసుకున్న పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్..ఇదేం మాయరోగం అంటూ..

"బ్రా" వేసుకున్న  పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్..ఇదేం మాయరోగం అంటూ..

సెంచరీలు చేస్తూ..విలువైన పరుగులు సాధిస్తూ..ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను  సంపాదించుకున్న పాక్ కెప్టెన్ బాబర్ అజమ్...బ్రా వేసుకుని ఆశ్చర్యపరిచాడు.  శ్రీలంకతో జరిగిన రెండో టెస్టు తర్వాత మైదానాన్ని వీడే క్రమంలో బాబర్ స్పోర్ట్స్ బ్రాతో కనిపించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పాక్ కెప్టె్న్ బాబర్ ఆజమ్..బ్రా వేసుకోవడంపై ఫాన్స్, నెటిజన్లు అవాక్కయ్యారు.  బాబర్ ‘ బ్రా’ వేసుకోవడం ఏంటి...ఇదేం మాయరోగం అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

స్పోర్ట్స్ బ్రా..ఒక్కసారిగా షాక్..

పాక్, శ్రీలంక మధ్య కొలంబోలో రెండో టెస్టు జరిగింది. ఈ టెస్టులో పాకిస్తాన్ ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ టెస్టులో గెలిచిన తర్వాత పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ మైదానాన్ని వీడుతుండగా....గ్యాలరీలో ఉన్న ఓ  ఫాన్స్.. జెర్సీ ఇవ్వమని కోరాడు.  దాంతో ఆ అభిమానికి జెర్సీని ఇచ్చేందుకు విప్పాడు. దీం పాక్ కెప్టెన్ వేసుకున్న స్పోర్ట్స్  బ్రా వేసుకున్నట్లు బయటపడింది. బాబర్ స్పోర్ట్స్ బ్రా వేసుకోవడంపై అక్కడి ఫాన్స్, సెక్యూరిటీ సిబ్బంది ఒక్కసారిగా షాక్ అయ్యారు. 

క్రీడాకారులకు ఇది మామూలే..

సాధారణంగా మేల్ క్రీడాకారులు తమ జెర్సీ లోపల బనీయన్, లేదా ట్రాక్ సూట్ ధరిస్తారు. కానీ బాబర్ స్పోర్ట్స్ బ్రా వేసుకోవడంపై అంతా ఆశ్యర్యపోతున్నారు. అయితే దీనిపై కొందరు క్రీడా నిపుణులు వివరణ ఇస్తున్నారు.  ఇది స్పోర్ట్స్ బ్రా కాదని.. అలా కనిపించే వెస్ట్ అని చెబుతున్నారు.  క్రీడల్లో ఇది ఎప్పుడో ప్రవేశపెట్టారని.. చాలా తక్కువ మంది మాత్రమే దీన్ని ఉపయోగిస్తారని అంటున్నారు. దీన్ని కంప్రెషన్ వెస్ట్ అని పిలుస్తారట.  వెన్నును నిటారుగా ఉంచేందుకు.. వీపులోని కండరాలు ఫిట్‌గా ఉండేందుకు ఇది బాగా యూజ్ చేస్తుందట.  అంతేకాదు చాలా తేలికగా ఉండే ఇది వేసుకుంటే.. కనీసం ధరించినట్లు కూడా అనిపించదట.

బ్రాలో జీపీఎస్ ట్రాకర్ కూడా...

ఈ వెస్ట్‌లో జీపీఎస్ ట్రాకర్ కూడా ఉంటుంది. ఇందులో గైరోస్కోప్, మాగ్నెటోమీటర్ ఉంటాయి. ఇది ఆటగాడి కదలికలను 3Dలో కొలుస్తూ.... అన్నింటిని ట్రాక్ చేస్తుంది . ఆటగాడి రన్నింగ్ స్పీడ్‌ని కూడా తెలుసుకోవచ్చు.  వీటితోపాటు ఈ వెస్ట్‌లో హార్ట్ రేట్ మానిటర్ కూడా ఉందిట. వీటన్నింటి సాయంతో సేకరించిన సమాచారాన్ని డేటా బేస్‌లో దాచుకోవచ్చు.  టీమిండియా ఆటగాళ్లు కూడా కొన్నిసార్లు వీటిని ధరిస్తుంటారట. 2018లో భారత కండిషనింగ్ కోచ్‌గా ఉన్న శంకర్ బసు దీన్ని టీమ్ కు  పరిచయం చేశాడట.