
ఛాంపియన్స్ ట్రోఫీలో ఆతిధ్య పాకిస్థాన్ జట్టు టోర్నీ నుంచి దాదాపుగా నిష్క్రమించింది. ఆడిన రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయిన పాక్.. సెమీస్ కు వెళ్లాలంటే అద్భుతం జరగాల్సిందే. టోర్నీ తొలి మ్యాచ్ లోనే న్యూజిలాండ్ పై 60 పరుగుతో తేడాతో పరాజయం పాలైంది. ఆదివారం (ఫిబ్రవరి 23) జరిగిన గ్రూప్–ఎ మ్యాచ్‌లో ఇండియా 6 వికెట్ల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. వరుసగా రెండు మ్యాచ్ లు ఓడిపోయినా పాకిస్థాన్ సెమీస్ ఆశలు ఏదో మూల ఇంకా సజీవంగానే ఉన్నాయి. పాకిస్థాన్ సెమీస్ కు చేరాలంటే ఏం జరగాలో ఇప్పుడు చూద్దాం.
గ్రూప్ ఏ లో మరో మూడు మ్యాచ్ లు జరగాల్సి ఉంది. వీటిలో పాకిస్థాన్.. బంగ్లాదేశ్ పై ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ భారీ విజయం సాధించడం తప్పనిసరి. సోమవారం (ఫిబ్రవరి 24) జరిగే గ్రూప్–ఎ రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో న్యూజిలాండ్ తలపడనుంది. ఈ మ్యాచ్ లో కివీస్ బంగ్లాదేశ్ పై ఖచ్చితంగా ఓడిపోవాలి. ఆదివారం (మార్చి 2) న్యూజిలాండ్ పై టీమిండియా ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. ఇలా జరిగితే రోహిత్ సేన మూడు మ్యాచ్ ల్లో గెలిచి టాప్ లో ఉంటుంది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ ఒక్కో మ్యాచ్ గెలిచి సెమీస్ రేస్ లో ఉంటాయి.
Also Read : కివీస్‌కు తలనొప్పిగా మారిన జట్టు సెలక్షన్
బంగ్లాదేశ్ పై పాకిస్థాన్ గెలిచినా.. న్యూజిలాండ్ పై ఇండియా గెలిచినా.. నేడు జరగబోయే మ్యాచ్ లో కివీస్ ను బంగ్లాదేశ్ ను ఓడించాలంటే శక్తికి మించిన పని. ఈ రోజు ఒకవేళ బంగ్లాదేశ్ ఓడిపోతే భారత్, న్యూజిలాండ్ అధికారికంగా సెమీస్ బెర్త్ కంఫర్మ్ చేసుకుంటాయి. మరోవైపు పాకిస్థాన్, బంగ్లాదేశ్ ఇంటిదారి పడతాయి. ప్రస్తుతం టీమిండియా రెండు విజయాలతో టాప్ లో ఉంది. కివీస్ ఒక విజయంతో రెండో స్థానంలో ఉంది.
Pakistan’s qualification scenario:
— Ahmad Haseeb (@iamAhmadhaseeb) February 23, 2025
- Bangladesh beat New Zealand by at least 50+ runs.
- India beat New Zealand by 50+ runs.
- And then Pakistan beat Bangladesh by a huge margin.
#INDvsPAK #ChampionsTrophy2025 pic.twitter.com/VwhX7vLQLL