
ఒక కుటుంబం ది బెస్ట్ ఫ్యామిలీగా అనిపించుకోవాలంటే.. అందులో ఆడ, మగ.. ఇద్దరి పాత్రా సమానంగా ఉండాలి. ఇక్కడ అధికారం, పంతాలు అని కూర్చుంటే జీవితంలో చివరకు మిగిలేది ఏమీ ఉండదు. ఇంట్లో పని చేస్తూ, కుటుంబసభ్యుల ఆలనా పాలనా చూస్తూ, ఇతర పనులు చేసినంత మాత్రాన ఆడవారి స్థాయి తగ్గదన్న మాటలో ఏ మాత్రం సందేహం లేదు. ఆ సమయంలో వారికి బయటికెళ్లి ఉద్యోగం చేయాల్సిన సందర్భం రాకపోవచ్చు, లేదా ఇతర కారణాలూ ఉండొచ్చు. అంతే కానీ వారికి టాలెంట్ లేకా కాదు.. వారికి చేత కాకా కాదు. కొంత మంది ఆడవాళ్లకు బయటికెళ్లి ఉద్యోగం చేయాలని ఉంటుంది. మిగతా ఆడవాళ్లలా స్వేచ్ఛగా ఉండాలని ఉంటుంది. కానీ ఇంట్లో పరిస్థితులు, కొన్ని సార్లు ఆమె నిర్ణయానికి భర్త లేదా కుటుంబం విలువివ్వకపోవడం వల్ల ఆమె లక్ష్యాలు ఇంటి కడప దగ్గరే ఆగిపోతున్నాయి. దానికి ఉదాహరణగా నిలుస్తోంది ఓ పోస్టు. కారణాలేమైనా గానీ.. ఆడవాళ్లు కొన్నిసార్లు ఇంటి బాధ్యతను మోయడానికి, మగవాళ్లు కేవలం సంపాదించడానికే అన్నట్టు మారిపోయింది. అదీ పాకిస్థాన్ లో ఈ తరహా పరిణామాలు చాలానే ఉన్నట్టు ఈ పోస్టు సూచిస్తోంది.
ఒక పాకిస్థానీ 'కెరీర్ మెంటర్' ఆడవారి పని నీతిని ప్రశ్నించిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియా సైట్ 'X'లో విపరీతంగా షేర్ అవుతోంది. Sofia Reza LinkedInలో అప్ లోడ్ చేసిన ఈ పోస్ట్ స్క్రీన్‌షాట్‌ను ఇస్లామాబాద్‌కు చెందిన ఒక కేక్ ఆర్టిస్ట్ ఎక్స్‌లో పంచుకున్నారు. ఇప్పుడిది ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌లో.. మహిళా అభ్యర్థులు 50 శాతం సమయం ఇంటర్వ్యూలకు వెచ్చిస్తారని, పురుషులు దాదాపు 80 శాతం సమయాన్ని ఇస్తారని రెజా తెలిపారు. మహిళలు కుటుంబ అత్యవసర పరిస్థితి అనే సాకును తరచుగా ఉపయోగిస్తారని ఆమె చెప్పారు.
ALSO READ :పవన్ కళ్యాణ్ ప్రజలను రెచ్చగొడుతున్నారు: పేర్నినాని
“ఇది ఆమె ఊహ మాత్రమేనా లేక దీని వెనుక ఏదైనా డేటా ఉందా?" అని ఈ పోస్టుపై స్పందించిన ఓ యూజర్ అన్నారు. "ఇది చాలా కోపం తెప్పిస్తోంది. మహిళలు కుటుంబ అత్యవసర పరిస్థితులతో వ్యవహరించడం వల్ల పురుషులు తమ జీవితాలను సాధారణంగా కొనసాగించడానికి సాధ్యమవుతుంది. ఇది పిల్లలు/అత్తమామల ఆరోగ్యం, ఇంటి నిర్వహణ, ఇతర సమస్యలకు సంబంధించింది ఏదైనా కావచ్చు. ఇలా చూసుకుంటే ఎవరి కెరీర్‌లో ఒక రోజు సెలవు ఇవ్వాలి? ముమ్మాటికీ స్త్రీకే ” అని ఇంకొకరు రాసుకువచ్చారు. “పురుషులు తమ పాత్రను పోషిస్తే స్త్రీలకు కుటుంబ అత్యవసర పరిస్థితులు ఉండకపోవచ్చు. మహిళల స్థాయిని దిగజార్చకండి ”మరొక వ్యక్తి సూచించారు.
LinkedIn remains undefeated as the worst platform ever ? this is a serious post by a person who considers themselves a mentor … a mentor for misogyny maybe, them and all the HR executives liking the post pic.twitter.com/RoUfpKfDG7
— bis (@itsokaybis) August 13, 2023