
కూసుమంచి మండలం హట్యాతండా వద్ద పాలేరు ఎడమ కాల్వ గండి పూడిక పనుల పురోగతిని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. పాలేరు ఎడమ కాల్వ గండి పూడిక పునరుద్ధరణ పనుల వేగం పెంచాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
పాలేరు ఎడమ కాల్వ గండి పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం రైతులకు సాగునీరు అందించడానికి చేపట్టిన పనులలో వేగం పెంచాలని ఇంజనీరింగ్ అధికారులకు మంత్రి సూచించారు. గండి పూడిక పనులు 24 గంటల పాటు జరగాలని, అవసరమైన మేర అదనపు యంత్రాలు, షిఫ్టులవారీగా కార్మికులు పనిచేసేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రి అన్నారు. కాల్వ తవ్వకం, లైనింగ్ పనులు సమాంతరంగా జరగాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ALSO READ | తెలంగాణ అమరవీరులకు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నివాళులు