పాల్వంచ, వెలుగు : ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై పాల్వంచ మున్సిపల్ కమిషనర్ కే.సుజాత దృష్టి సారించారు. కార్యాలయంలో ప్రజల సమర్పించిన ఫిర్యాదులను వెంట తీసుకొని ఆమె శనివారం మున్సిపాలిటీలోని హమాలీ కాలనీ, బా పూజీ నగర్, రామానంద తీర్ధకాలనీ, శ్రీనివాస కాలనీ, మార్కెట్ ఏరియాల్లో పర్యటించారు.
ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. చాలా ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీ, వీధి దీపాలు, తాగునీటి సమస్యను కమిషనర్ దృష్టికి ప్రజలు తీసుకువచ్చారు. వీటి పరిష్కారానికి కొంత సమయం కావాలని కమిషనర్ సూచించారు. ఆమె వెంట పలువురు మున్సిపల్ అధికారులు, శానిటరీ, తాగునీటి విభాగం సిబ్బంది ఉన్నారు.