భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి ఆదాయం 8.. వ్యయం 2

భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి ఆదాయం 8.. వ్యయం 2

భద్రాచలం,వెలుగు : ఉగాది సందర్భంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఆదివారం రాత్రి బేడా మండపంలో పంచాంగ శ్రవణం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో తరలిరాగా ముందుగా సీతారామయ్యకు విశ్వక్షేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన జరిపించి పంచాంగం పుస్తకాలను స్వామి సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.

 ప్రత్యేక హారతులు సమర్పించారు. భద్రాద్రిరామయ్యకు ఆదాయం 8, వ్యయం, రాజపూజ్యం 7, అవమానం 3, సీతమ్మవారికి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6 ఉంటాయని స్థానాచార్యులు స్థలసాయి పంచాంగ శ్రవణంలో వివరించారు. రాష్ట్ర ప్రజలంతా ఆధ్యాత్మిక చింతన కల్గి ఉండాలని సూచించారు.