గుండం గుడిని అభివృద్ధి చేస్తా : మంత్రి సీతక్క

గుండం గుడిని అభివృద్ధి చేస్తా : మంత్రి సీతక్క

కొత్తగూడ, వెలుగు: మహబూబాబాద్​జిల్లా కొత్తగూడ మండలం గుండంపల్లి గుడి తండాలోని కాకతీయుల కాలం నాటి రాజరాజేశ్వరాలయాన్ని అభివృద్ధి చేస్తానని పంచాయతీ రాజ్​ శాఖ మంత్రి సీతక్క అన్నారు. గుండం గుడిని మంత్రి సీతక్క గురువారం సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. 

అనంతరం మంత్రి మాట్లాడుతూ తన నిధుల నుంచి శివరాత్రి వేడుకలకు రూ.25 లక్షలతో అభివృద్ధి పనులు చేసినట్లు తెలిపారు. వచ్చే శివరాత్రి వరకు గుడి నుంచి దబ్బీర్​పేట మీదుగా నల్లబెల్లి వరకు, గుడి నుంచి కొత్తగూడ వరకు డబుల్​ రోడ్డు నిర్మాణం చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బ్లాక్​ కాంగ్రెస్​మండలాధ్యక్షుడు మొగిలి, పార్టీ మండలాధ్యక్షుడు వజ్జ సారయ్య, లీడర్లు తదితరులు పాల్గొన్నారు.