పంచాయతీ వర్కర్ ను ఎద్దు పొడిచింది

పంచాయతీ వర్కర్ ను ఎద్దు పొడిచింది

మల్హర్, వెలుగు: ఎద్దు పొడవడంతో గ్రామ పంచాయతీ కార్మికుడు మృతి చెందిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగింది.  కొయ్యూరు ఎస్ఐ నరేశ్,​ స్థానికులు తెలిపిన ప్రకారం.. మల్హర్ మండలం ఎడ్లపల్లి గ్రామానికి చెందిన గుర్రం సమ్మయ్య (60) పంచాయతీ కార్మికుడు. గురువారం జీపీ కార్మికులు ట్రాక్టర్ ద్వారా చెత్తను సేకరించి డంపు యార్డులో వేసి పంచాయతీ ఆఫీసుకు వచ్చారు. సమ్మయ్య విధులు ముగించుకొని ఇంటికి వెళ్తుండగా.. అకస్మాత్తుగా ఎద్దు ఎదురుగా వచ్చి అతడిని పొడిచింది. దీంతో  రక్తం వాంతులు చేసుకొని పంచాయతీ ఆవరణలోనే మృతి చెందాడు. డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం మహదేపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.