
న్యూఢిల్లీ : పారిస్ పారాలింపిక్స్‌లో పతకాలు నెగ్గిన ఐదుగురు పారా షట్లర్లకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బాయ్) రూ. 50 లక్షల నజరానా ప్రకటించింది. గోల్డ్ నెగ్గిన నితేశ్ కుమార్‌కు 15 లక్షలు, సిల్వర్ మెడలిస్టులు సుహాస్, తులసిమతికి చెరో. 10 లక్షలు, కాంస్య పతక విజేతలు మనీషా, నిత్యశ్రీకి తలో 7.5 లక్షల చొప్పున అందిస్తామని తెలిపింది.