ఎగ్ దోశకు డబ్బులివ్వలేదని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

ఎగ్ దోశకు డబ్బులివ్వలేదని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య

చిత్తూరు: కోడిగుడ్డ దోశ తింటానని.. డబ్బులివ్వమని అడిగితే ఇంట్లో వారు ఇవ్వలేదని అలిగి.. తీవ్ర మనస్తాపానికి గురైన బీటెక్ విద్యార్థి తన ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయి గ్రామ శివార్లలోని కుంటలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఇరంగారిపల్లి పంచాయతీ పరిధిలో జరిగిందీ ఘటన. ఇదే పంచాయితీ పరిధిలోని మజరా గ్రామమైన తలారివారిపల్లికి చెందిన సాయి కిరణ్(21) వేము ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. 
బుధవారం నాడు ఇతనికి ఇంట్లో కుటుంబ సభ్యులు ఎగ్‌ దోస కోసం డబ్బులు ఇవ్వలేదని మనస్తాపంతో ఇరరంగారిపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న గుర్రప్పకుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పాకాల ఎస్.ఐ వంశిధర్, ఎస్.ఐ- రామకృష్ణ  విద్యార్థి ఆత్మహత్యను ధృవీకరించారు. తలారిపల్లికి చెందిన దివంగత రమణయ్య కుమారుడు సాయి కిరణ్(21) వేము ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడవ సంవత్సరం చదువుతూ ఇంట్లో వారిపై అలిగి అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలిపారు. కుంటలో శవం కనిపించడంతో స్థానికులు అటుగా వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్తుండగా చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి మహిళా పోలీస్ సాయి విజయ, సచివాలయ సిబ్బంది, ఏ.ఎస్.ఐ నారాయణస్వామి పోలీసు కానిస్టేబుళ్లు రాజేష్, రమేష్, శేఖర్, ఇతర సిబంది వెళ్లి కుంటలో నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 
 

మరిన్ని వార్తల కోసం..

క్లైమాక్స్‌కు వచ్చిన తన్నులాట.. తెలంగాణ నువ్వెటు వైపు?

రాళ్లను కలెక్ట్​ చేస్తున్న పద్నాలుగేళ్ల సైంటిస్ట్

బెదిరింపులు వస్తున్నయ్.. గన్ లైసెన్స్ ఇస్తరా? లేదా?

ఐపీఎల్‌లో కరోనా కలకలం: నటరాజన్‌కు పాజిటివ్