హిందూ దేవుళ్లను, మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నాడని కేసు నమోదు అవడంతో ఓ పాస్టర్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వైజాగ్ కు చెందిన హనీ జాన్సన్ అనే పాస్టర్ మహిళలు,హిందువుళ్ళపై కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని సైబరాబాద్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి. అంతే కాకుండా హైదరాబాదులో హనీ జాన్సన్ పై నాలుగు కేసులు.. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో మూడు కేసులు నమోదైనట్లు సమాచారం.
వైజాగ్ లో హనీ జాన్సన్ ను అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలించారు. కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు తెలుస్తోంది. హనీ జాన్సన్ ఒక చర్చిని నడపడంతో పాటు యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుడి ప్రసంగాలు చేస్తారు. అయితే ఇదే క్రమంలో మహిళలపై హిందూ దేవుళ్ళపై వ్యాఖ్యలు చేశారని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదులు అందాయి.
అయితే పాస్టర్ ను అరెస్ట్ చేయడంను ఆయన సన్నిహితులు వ్యతిరేకిస్తున్నారు. పాస్టర్ ను తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్టు చేయించారని ఆరోపిస్తున్నారు. మరోవైపు మహాసేన మీడియా హానీ జాన్సన్ ను విడిచిపెట్టక పోతే హుజురాబాద్ ఎలక్షన్లో మహాసేన TRS కు వ్యతిరేకంగా ప్రచారంలో పాల్గొంటుదని హెచ్చరించింది.