టీటీడీ ఛైర్మన్, జేఈవో క్షమాపణలు చెప్పాల్సిందే: పవన్ కళ్యాణ్

తిరుపతి తొక్కిసలాట ఘటనపై  ఏపీ డిప్యూటీ  సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఘటనపై టీటీడీ పాలకమండలి, అధికారులు క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు.  తొక్కిసలాట ఘటనలో  తాను క్షమాపణ చెప్పినప్పుడు..మీకెందుకు  నామోషీ ఏంటని ప్రశ్నించారు పవన్. టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, జేఈఓ వెంకయ్య చౌదరి, సభ్యులు క్షమాపణ చెప్పాలన్నారు. 

తప్పు ఎవరి వల్ల జరిగినా క్షమాపణ చెప్పాల్సిందే..వారికి వేరే దారి లేదన్నారు పవన్.  తప్పు ఎవరు చేసినా ప్రభుత్వంలోని వారంతా బాధ్యత తీసుకోవాల్సిందేనన్నారు. ప్రభుత్వంలో తనకు బాధ్యత ఉంది కాబట్టే క్షమాపణ చెప్పానన్నారు పవన్. ఎవరి బాధ్యత వారు నిర్వర్తించి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు.తిరుమల ఘటనతో చాలా బాధపడ్డానన్నారు. వీఐపీ ట్రీట్ మెంట్ తగ్గి..కామన్ మ్యాన్ ట్రీట్ మెంట్ పెరగాలన్నారు. తిరుపతి ఘటనలో డీఎస్పీ వైఫల్యం కూడా ఉందన్నారు పవన్. 

ALSO READ | తిరుపతి తొక్కిసలాటకు చంద్రబాబే కారణం.. కేఏ పాల్

తిరుమల వైకుంఠ ద్వారా దర్శనం టికెట్ల జారీ సందర్భంగా జనవరి 8న  తొక్కిసలాటలో ఆరుగురు మృతి చెందగా..పలువురికి తీవ్రగాయాలైన సంగతి తెలిసిందే. ఘటనా స్థలానికి వెళ్లి  ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.