ఆర్థిక శాఖ మంత్రితో పేటీఎం CEO భేటీ

ఆర్థిక శాఖ మంత్రితో పేటీఎం CEO భేటీ

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 29 తర్వాత పేటీఎం తన సర్వీసుల నిలిపివేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో రెండు గతకొద్ది రోజులుగా పేటీఎం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 17,378.41 కోట్లు తగ్గింది. స్టాక్ మార్కెట్ లో షేర్ల విలువ కూడా గణనీయంగా పడిపోయాయి. పేటీఎం CEO ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత్ దాస్ కలిసినప్పటికీ చర్చలు ఫలించలేదు. 

ఈ నేపథ్యంలో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ను ఈ రోజు కలవనున్నారు.  విధించిన ఆంక్షల గడువు పొడగింపు, పేటీఎం లైసెన్స్ బదిలీ వంటి పలు విషయాలపై ఆయన నిర్మలాసీతారామన్ తో చర్చించనున్నారు.

ALSO READ:  6 బ్యాంకుల్లో వాటాలు పెంచుకోనున్న హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ గ్రూప్‌‌