పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (PCB) ఆదివారం (ఫిబ్రవరి 28) వన్డే, టీ 20 లకు ప్రధాన కోచ్‌గా ప్రపంచ కప్ విజేత గ్యారీ కిర్‌స్టెన్‌ను నియమించింది. టెస్టులకు మాత్రం ఆస్ట్రేలియన్ మాజీ పేసర్ జాసన్ గిల్లెస్పీను ప్రధాన కోచ్ గా ఎంపిక చేశారు. మాజీ పాకిస్థాన్ ఆల్ రౌండర్ అజర్ మహమూద్‌ను మూడు ఫార్మాట్లలో జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా నియమించారు. గ్యారీ కిర్‌స్టెన్ కోచ్ గా భారత్ 2011 లో వరల్డ్ కప్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. పాక్ క్రికెట్ బోర్డు గ్యారీ కిర్‌స్టెన్ నియమించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
'అత్యున్నత స్థాయి కోచ్‌లుగా ఉన్న గ్యారీ కిర్‌స్టెన్, జాసన్ గిల్లిస్పీల నియామకం పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ఎంత విలువ ఇస్తుంది. ఆటగాళ్లపై విదేశీ కోచ్‌లు ఎంతో ప్రభావం చూపిస్తారు. అని పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ మీడియాతో అన్నారు. మేము జట్టుకు అత్యుత్తమ సౌకర్యాలను అందించాలనుకుంటున్నాము. అందుకే మేము కిర్‌స్టన్, గిల్లిస్పీలను తీసుకున్నాం. అని ఆయన అన్నారు.
మే 22 నుండి పాకిస్తాన్ నాలుగు టీ20 సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. కిర్‌స్టెన్ ఈ సిరీస్ నుచి బాధ్యతలను స్వీకరిస్తాడు. ఈ పర్యటన తర్వాత వెస్టిండీస్, అమెరికా వేదికగా జూన్ 1 నుంచి టీ20 వరల్డ్ కప్ జరగనుంది. పాక్ క్రికెట్ బోర్డు గత మూడు నెలల నుంచి విదేశీ కోచ్ లపై ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ షేన్ వాట్సాన్ ను భారీ మొత్తంలో డబ్బు ఇవ్వడానికి సిద్ధమయ్యారు. అయితే వాట్సన్ పాక్ కోచ్ పదవిపై ఆసక్తి చూపించలేదు.
Gary Kirsten - Pakistan ODI & T20I coach.
— Johns. (@CricCrazyJohns) April 28, 2024
Jason Gillespie - Pakistan Test coach. pic.twitter.com/tPgT1HNCBP