బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ హయాంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం : మహేశ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌

బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ హయాంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం :  మహేశ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌
  • రాష్ట్రాన్ని ఏడున్నర లక్షల కోట్ల అప్పుల పాలు చేసింది
  • గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను బలోపేత చేస్తూ పథకాలు అమలు చేస్తున్నామని వెల్లడి

జీడిమెట్ల, వెలుగు: రాష్ట్రంలో గాడితప్పిన అర్థిక వ్యవస్థను సరిచేస్తూ ప్రజలకు ఇచ్చిన హమీలను కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం అమలు చేస్తుందని పీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌ మహేశ్ కుమార్ గౌడ్‌‌‌‌‌‌‌‌ అన్నారు. కార్యకర్తలు, పార్టీ నేతల కోరిక మేరకు సోమవారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ దూలపల్లిలోని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఇంటికెళ్లి, ఆయనను మహేశ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గౌడ్‌‌‌‌‌‌‌‌ మర్యాపూర్వకంగా కలిశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వం రూ.7.50 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని దివాలా తీయించిందని ఆరోపించారు. 

చిన్నాభిన్నం చేసిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూ ప్రజలకిచ్చిన హామీలను కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం నెరవెర్చే ప్రయత్నం చేస్తోందని చెప్పారు. ఈ 9 నెలల కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి అత్యధిక స్థానాలు గెలుచుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ప్రజల్లో ఉంటూ బాధ్యతగా పనిచేయాలన్నారు. 

ప్రతి కార్యకర్తకు గుర్తింపునిచ్చే పార్టీ కాంగ్రెస్ అని, మరోవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు మన పార్టీ వైపు చూస్తున్నాయన్నారు. రాబోయే కాలంలో రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తామని చెప్పారు. రాష్ట్రంలో కార్యకర్తలు కృషి, త్యాగాల వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, రాబోయే రోజుల్లో ప్రతి కార్యకర్త సంక్షేమం కోసం కృషి చేస్తూ.. పార్టీని మరింత బలోపేతం చేద్దామన్నారు. పార్టీ తర్వాతే అధికారమైనా, పదువులైనా అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.